IPL 2021 - SRH Vs CSK : పటిష్ట చెన్నై తో హైదరాబాద్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, తుది జట్లు ఇవే..!

IPL 2021 - SRH Vs CSK

IPL 2021 - SRH Vs CSK : ఇప్పటికే రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన సన్ రైజర్స్.. మిగతా జట్ల అవకాశాల్ని దెబ్బ తీసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో కేన్ సేన.. టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ (SRH Vs CSK) తో అమీతుమీ తేల్చుకోనుంది.

  • Share this:
    ఐపీఎల్ 2021(IPL 2021 Latest Telugu News) సీజన్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది. మ్యాచ్ విజయం కోసం ప్రతి జట్టు హోరాహోరీగా తలపడుతున్నాయ్. ఇక, ప్లే ఆఫ్ రేస్ కూడా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన సన్ రైజర్స్.. మిగతా జట్ల అవకాశాల్ని దెబ్బ తీసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో కేన్ సేన.. టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ (SRH Vs CSK) తో అమీతుమీ తేల్చుకోనుంది. పాయింట్స్ టేబుల్ లో సన్ రైజర్స్ లాస్ట్ ప్లేస్ లో ఉండగా.. ధోనీసేన టాప్ ప్లేస్ లో దుమ్మురేపుతోంది. గత మ్యాచ్ లో విక్టరీ కొట్టిన సన్ రైజర్స్.. అదే ఫామ్ ను కంటిన్యూ చేసి ధోనీసేనను మట్టికరిపించాలని భావిస్తోంది. మరోవైపు, మరో విక్టరీ కొట్టి.. తమకు తిరుగులేదని నిరూపించాలని ప్రయత్నిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో, ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    చెన్నై సూపర్ కింగ్స్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆల్ రౌండ్ షో తో దుమ్మురేపుతోంది ధోనీసేన. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. వీరిద్దరూ మంచి ఆరంభాలు అందిస్తూ.. జట్టుకు విజయ బాటలు వేస్తున్నారు. వీరిద్దరూ ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నారు. ఇక, రాయుడు, మొయిన్ అలీ, రైనా కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఇక, ధోనీ ఫామ్ లో లేడు. అతడు కూడా లయ అందుకుంటే చెన్నైని ఆపడం కష్టమే. ఇక, చెన్నైకి అతి పెద్ద ప్లస్ పాయింట్ రవీంద్ర జడేజా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో దుమ్మురేపుతున్నాడు జడ్డూ.

    వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. అయితే అతను సామ్ కర్రన్ స్థానంలో తిరిగి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. బౌలింగ్ లో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జోష్ హజెల్ వుడ్ పేస్ బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు. వీరికి తోడుగా రవీంద్ర జడేజా, మొయిన్ అలీలు స్పిన్ భారాన్ని మోస్తున్నారు.

    ఇక, సన్ రైజర్స్ పరిస్థితి చెన్నైకి భిన్నంగా ఉంది. దూకుడుగా ఉండే ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను గత మ్యాచ్ లో పక్కన పెట్టి.. జాసన్ రాయ్ ను జట్టులోకి తీసుకురావడం హైదరాబాద్ కు కలిసొచ్చింది. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ మాత్రం తనకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. గత మ్యాచ్‌లో 60 పరుగులు సాధించి.. అదరగొట్టాడు. కేన్ విలియమ్సన్ కూడా ఫామ్ లోకి రావడం ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సిద్ధార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్ జాసన్ హోల్డర్ కూడా డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేశారు. ఇక, రషీద్ ఖాన్ స్పిన్ విభాగంలో దుమ్మురేపుతున్నాడు.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ఇక, హెడ్ టు హెడ్ రికార్డులు చెన్నైకే అనుకూలంగా ఉన్నాయ్. రెండు జట్లు 15 సార్లు తలపడగా.. చెన్నై 11 సార్లు నెగ్గగా.. హైదరాబాద్ కేవలం నాలుగు మ్యాచ్ ల్లో మాత్రమే గెలిచింది.

    తుది జట్లు అంచనా :

    చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ( కెప్టెన్), సామ్ కర్రన్/ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హజెల్ వుడ్

    సన్ రైజర్స్ హైదరాబాద్ : జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ వర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్ద్ కౌల్, సందీప్ శర్మ.
    Published by:Sridhar Reddy
    First published: