Home /News /sports /

IPL 2021 - MS Dhoni : ధోనీ ఖాతాలో అదిరిపోయే రికార్డులు.. తలైవాకి తిరుగులేదంతే..!

IPL 2021 - MS Dhoni : ధోనీ ఖాతాలో అదిరిపోయే రికార్డులు.. తలైవాకి తిరుగులేదంతే..!

MS Dhoni (Image Credit-IPL)

MS Dhoni (Image Credit-IPL)

IPL 2021 - MS Dhoni : క్రికెట్ ప్రపంచంలో ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్ లో ధోనీ సాధించిన రికార్డులు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లోనూ మిస్టర్ కూల్ రికార్డులతో దుమ్మురేపుతున్నాడు.

ఇంకా చదవండి ...
  ఐపీఎల్ 2021‌లో(IPL 2021 Latest Telugu News) వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) .. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం సన్ ‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ జట్టు నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని.. చెన్నై జట్టు 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. తొలుత ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చైన్నె సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక వృద్దిమాన్ సాహా మినహా మిగిలిన ఆటగాళ్లు ఎవరూ కనీసం 20 పరుగుల స్కోర్ కూడా చేయలేకపోయారు. సన్ ‌రైజర్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. దూకుడుగా ఆడింది. అయితే 14 ఓవర్ తర్వాత వెంట వెంటనే మెయిన్ ఆలీ, రైనా, డు ప్లెసిస్ పెవిలియన్ చేరడంతో.. చెన్నై స్కోర్ బోర్డు నెమ్మదించింది. చివరకు కెప్టెన్ ఎంఎస్ ధోని, అంబటి రాయుడులు చెన్నైని విజయతీరాలకు చేర్చారు. ఈ విక్టరీతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) దర్జాగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే.. 18 పాయింట్లతో అధికారిక బెర్త్ దక్కించుకుంది. 11 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలతో చెన్నై ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా ఘనత సాధించింది.

  ఇక, ఈ మ్యాచ్ లో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ఆరంభం (మధ్యలో ఒక సీజన్‌ మినహా) నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకే ఆడుతున్న ధోనీ.. వికెట్‌ కీపర్‌గా 100 క్యాచ్‌లు అందుకున్నాడు. వికెట్ కీపర్ వృద్దిమాన్‌ సాహా క్యాచ్‌ అందుకోవడం ద్వారా మహీ ఈ ఘనతను అందుకున్నాడు. ధోనీ తర్వాత ఒకే జట్టుకు ఆడుతున్న లిస్ట్ లో సీఎస్‌కే స్టార్ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా రెండో స్థానంలో ఉన్నాడు. రైనా 98 క్యాచ్‌లు అందుకున్నాడు. ముంబై ఇండియన్స్‌ స్టార్ ప్లేయర్ కీరన్‌ పొలార్డ్‌ 94 క్యాచ్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

  మొత్తంగా ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో వికెట్‌ కీపర్‌గా 119 క్యాచ్‌లు అందుకున్నాడు. మహీ 215 మ్యాచ్‌ల్లో 119 క్యాచ్‌లు, 39 స్టంప్స్‌లు చేశాడు. మొత్తంగా 158 ఔట్‌లలో పాలుపంచుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

  ధోని వికెట్‌ కీపర్‌గా ఒకే మ్యాచ్‌లో ముగ్గురి కంటే ఎక్కువ బ్యాట్స్‌మెన్‌ క్యాచ్‌లు తీసుకోవడం ఇది పదోసారి. గత మ్యాచులో జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా, ప్రియం గార్గ్ క్యాచులను మహీ అందుకున్నాడు. ధోనీ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌ 5 సార్లు ఒకే మ్యాచ్‌లో మూడు అంతకంటే ఎక్కువ బ్యాటర్స్‌ క్యాచ్‌లు తీసుకొని రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

  ఇది కూడా చదవండి : ఐపీఎల్ నయా బ్యూటీ క్వీన్, కుర్రాళ్ల క్రష్... తమన్నా..! ఆమె గురించి ఈ విషయాలు తెలుసా...?

  2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్‌కే జట్టుకే ఎంఎస్ ధోనీ ఆడుతున్నాడు. మధ్యలో పుణె సూపర్ జెయింట్స్ కి ఆడాడు. మహీ సారథ్యంలో చెన్నై జట్టు ఇప్పటికే మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. మరోసారి నాలుగో టైటిల్ దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం చెన్నై జట్టు ఫామ్ చూస్తుంటే.. అవలీలగా వారి టోర్నీ గెలిచే ఛాన్సులున్నాయ్.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chennai Super Kings, IPL 2021, Ms dhoni, Sunrisers Hyderabad, Suresh raina

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు