Kavya Maran: సన్ రైజర్స్ ఓడింది.. వైరల్‌గా మారిన కావ్య మారన్ ఫొటోలు.. నెటిజన్ల రియాక్షన్స్ ఇవే..

కావ్య మారన్((Image-Twitter))

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు అక్కడ టక్కున మెరుస్తారు ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్(Kavya Maran). ఆమె తన టీమ్‌ను సపోర్ట్ చేస్తుంటారు.

  • Share this:
    సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు అక్కడ టక్కున మెరుస్తారు ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్(Kavya Maran). ఆమె తన టీమ్‌ను సపోర్ట్ చేస్తుంటారు. ఎస్‌ఆర్‌హెచ్ (SRH) మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరాల ఫోకస్ కూడా ఆమెపైనే ఉంటుంది. పదే..పదే ఆమె తెరపై చూపిస్తుంటారు. గతంలో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హవాభావాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో(Social Media) విపరీతంగా వైరల్‌ అవుతుంటాయి.. సంతోషంలో ఉన్నప్పుడు కేరింతలు.. బాధగా ఉన్న బుంగ మూతి ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అయితే తాజాగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన సన్ రైజర్స్ జట్టు.. ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది.

    బ్యాటింగ్‌లో విఫలం అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) జట్టు బౌలింగ్‌లో కూడా చేతులెత్తేసింది. ఏ దశలోనూ ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను నిలువరించ లేకపోయింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. మొత్తానికి ఆల్‌రౌండ్ షో చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి తిరిగి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకున్నది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన 135 పరుగల టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు సరైన ఆరంభం అందించలేక పోయారు. ఓపెనర్ పృథ్వీషా (11) ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కేన్ విలియమ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక ఆ తర్వాత శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ కలసి హైదరాబాద్ బౌలర్లను బెంబేలెత్తించారు. 17.5 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) లక్ష్యాన్ని చేధించింది.

    SRH vs DC: హైదరాబాద్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఆల్‌రౌండ్‌ షోతో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న క్యాపిటల్స్

    అయితే ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత కావ్య మారన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. పలువురు నెటిజన్లు కావ్య మారన్‌ను టార్గెట్ చేసుకుని ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెట్టారు. కొందరు జట్టు ఓటమికి ఆమెను నిందిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. బుధవారం సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కావ్య నవ్వుతూ కనిపించారు. దీంతో ఆమె నవ్వు చాలా అద్భుతంగా ఉంటుందని ఒకరు.. సన్‌ రైజర్స్‌కు అభిమానులు సపోర్ట్ చేయడానికి ఈమె కారణమని మరొకరు ఇలా కామెంట్స్ చేస్తున్నారు. కావ్య కోసమే మ్యాచ్ చూస్తున్నానని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని రియాక్షన్స్ ఇక్కడ చూద్దాం..













    కావ్య మారన్ గురించి..
    సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల ముద్దుల కూతురే కావ్య మారన్. అమె 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్నించారు. ఎంబీఏ పట్టా పోందిన కావ్య.. సన్ ‌నెట్‌వర్క్ సన్ మ్యూజిక్, ఎఫ్‌ఎం చానల్స్‌ బాధ్యతలను చూసుకుంటుంది. త్వరలోనే సన్‌గ్రూప్‌ బాధ్యతలను మెుత్తం తనే చూసుకోబోతున్నట్టుగా సమాచారం.
    Published by:Sumanth Kanukula
    First published: