• HOME
 • »
 • NEWS
 • »
 • SPORTS
 • »
 • IPL 2021 SIX CITIES IN FRAY TO HOST TOURNAMENT SA

IPL 2021: సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఐపీఎల్ లేదు!

IPL 2021: సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఐపీఎల్ లేదు!

ఐపీఎల్.. క్రికెట్ అభిమానులకు అంత్యంత ప్రియమైన క్రీడా ఈవెంట్. వేసవి వచ్చిదంటే చాలు ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తారు. ఐపీఎల్ 2021 సందడి అప్పుడే మెుదలైంది.

ఐపీఎల్.. క్రికెట్ అభిమానులకు అంత్యంత ప్రియమైన క్రీడా ఈవెంట్. వేసవి వచ్చిదంటే చాలు ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తారు. ఐపీఎల్ 2021 సందడి అప్పుడే మెుదలైంది.

 • Share this:
  ఐపీఎల్.. క్రికెట్ అభిమానులకు అంత్యంత ప్రియమైన క్రీడా ఈవెంట్. వేసవి వచ్చిదంటే చాలు ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తారు. ఐపీఎల్ 2021 సందడి అప్పుడే మెుదలైంది. తాజాగా జరిగిన వేలాన్ని చూస్తే త్వరలో జరగబోయే ఐపీఎల్ ఎంతటి పోటాపోటిగా జరగనుందో అర్ధమవుతుంది. మరో రెండు నెలలో జరగబోయే ఐపీఎల్ కోసం బీసీసీఐ సన్నహాలు మెుదలుపెట్టింది. తాజాగా వేదికలపై ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతానికి చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీలను మాత్రమే వేదికలుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే బ్యాడ్ న్యూస్ ఎంటంటే.. హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌లు జరగవని సమాచారం. దీంతో హైదరాబాద్‌ వాసులకు ఐపీఎల్ చూసే భాగ్యం లేనట్లే.

  ఇప్పటికైతే ఆరు వేదికలపైనే లీగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
  అలాగే ముంబైకి ఆ లిస్ట్‌లో చోటు దక్కలేదు. ఒక్కవేళ మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ముంబైలో కూడా ఐపీఎల్ నిర్వహిస్తారు. కాని పక్షంలో హైదరాబాద్‌కు అవకాశం దక్కొచ్చు. గత వేదికల్లో హైదరాబాద్, జైపూర్, మొహాలిలను కూడా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా పూర్తిగా అదుపులోకి రాని నేపథ్యంలో తక్కువ వేదికలకే ఐపీఎల్‌కు పరిమితం చేయాలని చూస్తున్నారు.
  Published by:Rekulapally Saichand
  First published:

  అగ్ర కథనాలు