హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 : ఐపీఎల్‌ వేలంలోకి అర్జున్ టెండూల్కర్.. కనీస ధర ఎంతో తెలుసా...?

IPL 2021 : ఐపీఎల్‌ వేలంలోకి అర్జున్ టెండూల్కర్.. కనీస ధర ఎంతో తెలుసా...?

IPL 2021 : ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ కోసం రంగం సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 18న చెన్నైలో ఆక్షన్ జరగనుంది. అయితే, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఐపీఎల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

  ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ కోసం రంగం సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 18న చెన్నైలో ఆక్షన్ జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వేలం మొదలవుతుంది. ఈ క్రమంలో దరఖాస్తులు చేసుకోవాలంటూ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) పిలుపునిచ్చిన నేపథ్యంలో ఊహించని రేంజ్‌లో దరఖాస్తులువచ్చాయి. ఈసారి మినీ ఆక్షన్ ఉంటుందని ఐపీఎల్ యాజమాన్యం ముందే ప్రకటించింది. అయినా సరే భారీ ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. ఏకంగా 1097 మంది ఈసారి వేలంలో నమోదు చేసుకున్నారు. అయితే, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఐపీఎల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ నెల 18న మెగా టోర్నీ వేలం జరగనుండగా, 21 ఏళ్ల అర్జున్ రూ. 20 లక్షల కనీస ధర (బేస్ ప్రైస్)తో తన పేరును నమోదు చేసుకున్నాడు. అండర్-19 టోర్నీలలో అర్జున్ దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ, దేశవాళీ టోర్నీలలో ఆడకపోవడంతో ఐపీఎల్‌ గత సీజన్‌లలో పేరు నమోదు చేసుకునే అర్హత లేకుండా పోయింది. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జూనియర్ టెండూల్కర్ ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. దీంతో ఐపీఎల్‌ వేలానికి అర్హత సాధించాడు. వేలంలో అతడిని ఏ జట్టు సొంతం చేసుకుంటుందోనన్న ఆసక్తి ఇప్పుడు క్రికెట్ ప్రేమికుల్లో నెలకొంది.

  ఇక ఐపీఎల్ 2021 కోసం 1097 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 283 మంది విదేశీయులు ఉన్నారు. వారిలో కూడా అత్యధికంగా వెస్టిండీస్ నుంచి (56), ఆస్ట్రేలియా నుంచి (42) మంది అప్లై చేసుకున్నారు. దక్షిణాఫ్రికా (38), శ్రీలంక (31), న్యూజిలాండ్ (29), ఇంగ్లండ్ నుంచి (21) మంది అప్లై చేశారు. మిగిలిన వారిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (9), నేపాల్ (8), స్కాట్లండ్ (7), బంగ్లాదేశ్ (5), ఐర్లాండ్ (2), అమెరికా (2), జింబాబ్వే (2), నెదర్లాండ్స్ నుంచి ఒకరు దరఖాస్తు చేసుకున్నారు.

  ఐపీఎల్ 2020 దుబాయ్‌ కేంద్రంగా జరిగింది. ఈసారి భారత్‌లోనే నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ప్రేక్షకులను కూడా అనుమతించాలంటూ కేంద్రాన్ని కోరుతోంది. ఏప్రిల్ 11న ఐపీఎల్ 2021 సీజన్ మొదలై జూన్ 5 లేదా 6న ముగిసే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాలుగు స్టేడియంలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముంబైలోని వాంఖడే, బ్రాబోర్న్, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది.

  First published:

  Tags: Arjun Tendulkar, Bcci, IPL 2021, Sachin Tendulkar

  ఉత్తమ కథలు