RR vs PBKS : టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. అందరి కళ్లు నయా పొలార్డ్ పైనే...

RR vs PBKS : టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. అందరి కళ్లు నయా పొలార్డ్ పైనే...

RR vs PBKS : ఐపీఎల్ తొలి సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత మరో టైటిల్ గెలవలేదు. పాయింట్ పట్టికలో ఎప్పుడూ చివరి నాలుగు స్థానాల్లో ఉండే రాయల్స్.. గత సీజన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.

  • Share this:
    రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య కాసేపట్లో కీలక పోరు జరగనుంది. ఈ సీజన్ లో రెండు జట్లకు ఇదే ఫస్ట్ మ్యాచ్. అయితే, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, ఈ మ్యాచ్ లో అందరి కళ్లు నయా పొలార్డ్ అని పేరు తెచ్చుకుంటున్న యంగ్ క్రికెటర్ షారుఖ్ ఖాన్ పైనే ఉన్నయ్. భారీ హిట్టింగ్ చేయడంలో ఈ యంగ్ క్రికెటర్ దిట్ట. ఐపీఎల్ తొలి సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత మరో టైటిల్ గెలవలేదు. పాయింట్ పట్టికలో ఎప్పుడూ చివరి నాలుగు స్థానాల్లో ఉండే రాయల్స్.. గత సీజన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాయకత్వంలో జట్టు పేలవ ప్రదర్శన చేసింది. దీంతో యాజమాన్యం అతడిని ఈ సీజన్‌లో విడుదల చేసి.. యువ క్రికెటర్ సంజూ (Sanju Samson)శాంసన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్ జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నారు. కానీ జట్టుకు అవసరమైన సమయంలో వాళ్లు విఫలమవడం భారంగా మారింది. జాస్ బట్లర్, బెన్‌స్టోక్స్ జోడి రాయల్స్‌కు ఓపెనర్లుగా బరిలోకి దిగితే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక సంజూ శాంసన్ ఫస్ట్ డౌన్‌లో రావడం జట్టుకు కలసి వస్తుంది. మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ తెవాతియా మంచి ఛాయిస్. జోఫ్రా ఆర్చర్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు. గత ఏడాది 20 వికెట్లు తీయడే కాకుండా 113 పరుగులు కూడా చేశాడు. అయితే క్రిస్ మోరీస్ ఈ సారి కొత్తగా జట్టుతో చేరాడు. ఆర్చర్ లేని లోటును అతడు తీర్చగలడని యాజమాన్యం భావిస్తున్నది. రియాన్ పరాగ్, శ్రేయస్ గోపాల్, శివమ్ దూబే‌లు రాణించాల్సిన అవసరం

    పంజాబ్ కింగ్స్ పేరుతో సరికొత్తగా అడుగుపెడుతున్న ఈ జట్టుకు కేఎల్ రాహుల్ నడిపిస్తున్నాడు. గత సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచే దూకుడు ప్రదర్శించి సీజన్ సగం అయ్యే సరికి పాయింట్స్ టేబుల్‌లో మంచి స్థానంలో ఉన్నది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్‌తో జట్టును నడిపించారు. కానీ క్రమంగా మ్యాచ్‌లు ఓడుతూ ప్లేఆఫ్స్ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకున్నది. స్టార్ బ్యాట్స్‌మాన్ క్రిస్ గేల్‌ను సగం మ్యాచ్‌లు ఆడించకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివర్లో మ్యాచ్‌లు ఓడిపోయి చివరకు ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సారి కూడా రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తోడు మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికొలస్ పూరన్ దూకుడుగా ఆడగలరు. ఈ సారి జట్టుతో కొత్తగా చేరిన షారుక్ ఖాన్ పైనే అందరి కళ్లు ఉన్నాయ్. బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమి, జే రిచర్డ్‌సన్‌కు తోడు రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్ లు బరిలోకి దిగనున్నారు.

    తుది జట్లు :

    Punjab Kings : KL Rahul(w/c), Mayank Agarwal, Chris Gayle, Nicholas Pooran, Deepak Hooda, Shahrukh Khan, Jhye Richardson, Murugan Ashwin, Riley Meredith, Mohammed Shami, Arshdeep Singh

    Rajasthan Royals : Jos Buttler(w), Manan Vohra, Ben Stokes, Sanju Samson(c), Riyan Parag, Shivam Dube, Rahul Tewatia, Chris Morris, Shreyas Gopal, Chetan Sakariya, Mustafizur Rahman
    Published by:Sridhar Reddy
    First published: