RR vs PBKS : సంజూ శామ్సన్ సూపర్ సెంచరీ వృథా..పంజాబ్ కింగ్స్ దే విక్టరీ..

RR vs PBKS : సంజూ శామ్సన్ సూపర్ సెంచరీ వృథా..పంజాబ్ కింగ్స్ దే విక్టరీ..

RR vs PBKS : ఐపీఎల్ అంటే ఇదే కదా. మరో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను రేపింది. మరో నేల్ బైటింగ్ ఫినిషింగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను విజయం వరించింది. సంజూశామ్సన్ కెప్టెన్ ఇన్నింగ్ వృథా అయింది.

  • Share this:
    ఐపీఎల్ లో మరో మ్యాచ్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది. ఆఖరి బంతి వరకు జరిగిన పోరాటంలో పంజాబ్ కింగ్స్ దే పై చేయి అయింది. సంజూ శామ్సన్ సూపర్ సెంచరీ వృథా అయింది. ముంబై వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో రాహుల్ సేన నాలుగు పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. సంజూ శామ్సన్ 63 బంతుల్లో 119 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి బంతికి ఐదు పరుగుల అవసరం అయితే, భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు సంజూ శామ్సన్. ఆఖరి ఓవర్ లో 13 పరుగులు అవసరం కాగా.. యంగ్ గన్ అర్షదీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పంజాబ్ బౌలింగ్ అర్షదీప్ మూడు వికెట్లు తీయగా.. షమీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక, పంజాబ్‌ సెట్ చేసిన 221 పరుగులను చేధించే క్రమంలో బ్యాటింగ్‌ మొదలు పెట్టిన రాజస్థాన్‌ మొదట్లోనే తడబడింది. తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌ అనంతరం మరో రెండు వికెట్లు కోల్పోయింది. బట్లర్‌ జట్టు స్కోరును కాస్త పెంచే ప్రయత్నం చేస్తున్నాడనుకుంటున్న సమయంలో వెనుదిరిగాడు. శివమ్ దూబే 23 పరుగులు, రియాన్ పరాగ్ 25 పరుగులతో సత్తా చాటిన కెప్టెన్ కు తోడు గా నిలబడలేకపోయారు. అతడే ఒక సైన్యంలా ఈ మ్యాచ్ లో పోరాడాడు సంజూ శామ్సన్. గ్రౌండ్ నలువైపులా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

    ఇక, ఐపీఎల్ 2021 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ గ్రాండ్‌గా మొదలుపెట్టారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91), దీపక్ హుడా(28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 64) పరుగుల సునామీ సృష్టించారు. వీరికి అండగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా ఓ చేయి వేయడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్.


    పంజాబ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 13 సిక్సర్లు, 18 ఫోర్లు వచ్చాయి. ఇక రాజస్థాన్ బౌలర్లంతా విఫలమైన వేళ అరంగేట్ర ప్లేయర్, యువ పేసర్ చేతన్ సకారియా ఆకట్టుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే (3/31) మూడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. క్రిస్ మోరిస్‌కు రెండు వికెట్లు దక్కగా.. రియాన్ పరాగ్ ఓ వికెట్ దక్కింది. ఇక, రేపు చెన్నై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది.
    Published by:Sridhar Reddy
    First published: