• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 RR VS PBKS LIVE SCORE UPDATES PUNJAB KINGS POST A MAMMOTH TOTAL OF 6 FOR 221 ON THE BOARD SRD

RR vs PBKS : రాహుల్, హుడా సిక్సర్ల సునామీ.. రాయల్స్ టార్గెట్ ఎంతంటే..

RR vs PBKS : రాహుల్, హుడా సిక్సర్ల సునామీ.. రాయల్స్ టార్గెట్ ఎంతంటే..

రాహుల్, హుడా సిక్సర్ల సునామీ.. రాయల్స్ టార్గెట్ ఎంతంటే..

RR vs PBKS : కేఎల్ రాహుల్, దీపక్ హుడా, క్రిస్ గేల్ లు అద్భుతంగా ఆకట్టుకున్నారు. రాహుల్ 50 బంతుల్లో 91 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక, దీపక్ హుడా సిక్సర్ల వర్షం కురిపించాడు.

  • Share this:
    రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి పంజాబ్ 221 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, దీపక్ హుడా, క్రిస్ గేల్ లు అద్భుతంగా ఆకట్టుకున్నారు. రాహుల్ 50 బంతుల్లో 91 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక, దీపక్ హుడా సిక్సర్ల వర్షం కురిపించాడు. దీపక్ హుడా 28 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఆరు సిక్సర్లు ఉన్నాయ్. ఇక, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను(9 బంతుల్లో 14; 2 ఫోర్లు) రాజస్థాన్‌ రాయల్స్‌ అరంగేట్రం బౌలర్‌ చేతన్ సకారియా బోల్తా కొట్టించాడు. ఓపెనర్‌ మయాంక్‌ వికెట్‌ కోల్పోయాక ఆచితూచి ఆడిన పంజాబ్‌.. 7 ఓవర్‌ తరువాత గేర్‌ మార్చింది. హార్డ్‌ హిట్టర్‌ గేల్‌, కెప్టెన్‌ రాహుల్‌లు లూస్‌ బంతులను పనిష్‌ చేస్తూ.. ఫోర్లు, సిక్సర్లు బాదారు. ముఖ్యంగా స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగిన విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ను(28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు‌) రియాన్‌ పరాగ్‌ పెవిలియన్‌కు పంపాడు. తెవాతియా వేసిన అంతకుముందు ఓవర్‌లో భారీ సిక్సర్‌ బాది ఊపుమీదున్నట్టు కనిపించిన గేల్‌, మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో లాంగ్‌ ఆన్‌లో ఉన్న బెన్‌ స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

    ఆ తర్వాత రాహుల్, దీపక్ హుడాలు సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా హుడా రెచ్చిపోయాడు. దూబే వేసిన 13 ఓవర్‌లో రెండు సిక్సర్లు, శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 14వ ఓవర్‌లో 3 భారీ సిక్సర్లు బాదిన దీపక్‌ హూడా మోరిస్‌ వేసిన 16వ ఓవర్‌లో కూడా భారీ సిక్సర్‌ బాది మెరుపు వేగంతో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ రాహుల్‌ కూడా రెచ్చిపోవడంతో పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్ సెట్ చేసింది.


    అయితే, ఆఖర్లో వరుసగా వికెట్లు పడటంతో పంజాబ్ 221 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో యంగ్ గన్ చేతన్ సకారియా మూడు వికెట్లతో శభాష్ అన్పించారు. క్రిస్ మోరిస్ రెండు వికెట్లు తీయగా.. రియాన్ పరాగ్ ఒక వికెట్ ను దక్కించుకున్నాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు