RR vs DC : స్టోక్స్ బదులు బరిలోకి స్టార్ హిట్టర్.. ఢిల్లీ జట్టులోకి స్టార్ బౌలర్..టాస్ నెగ్గిన RR

RR vs DC (Photo Credit : IPL)

RR vs DC : పంజాబ్ కింగ్స్‌ చేతిలో ఓటమిపాలైన రాజస్థాన్‌కు.. భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ఆ జట్టులో ఆందోళన మొదలైంది. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ లాంటి స్టార్ బౌలర్ సేవల్ని కోల్పయింది రాజస్థాన్.

 • Share this:
  ఐపీఎల్ 2021‌లో కాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ పోరు జరగనుంది. భారత యంగ్ కీపర్ల మధ్య పోరాటం ఫ్యాన్స్ ను అలరించనుంది. పంత్ వర్సెస్ సంజూ శామ్సన్ పోరులో ఎవరిదో పై చేయి అవుతుందో చూడాలి. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ లాంటి గట్టి జట్టును ఓడించిన ఢిల్లీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగనుంది. అందుకు కారణం క్వారంటైన్ కారణంగా ఫస్ట్ మ్యాచ్‌కి దూరమైన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రాబాడ ఈ మ్యాచుకు అందుబాటులోకి రావడమే. మరోవైపు పంజాబ్ కింగ్స్‌ చేతిలో ఓటమిపాలైన రాజస్థాన్‌కు.. భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. పంజాబ్ జట్టుపై అద్భుత సెంచరీ చేసి మంచి జోష్ ‌మీదున్నాడు. అయితే బెన్ ‌స్టోక్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికీ దూరమవడం ఆ జట్టుని కలవరపెడుతోంది. స్టోక్స్ స్థానంలో జోస్ బట్లర్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉంది. ఇక బట్లర్ స్థానంలో డేవిడ్ మిల్లర్ ఆడనున్నాడు. యువ ఆటగాడు రియాన్ పరాగ్ బెరుకు లేకుండా హిట్టింగ్ చేస్తుండటం ఆ జట్టుకి ఉపశమనం. అవసరం అయితే క్రిస్‌ మోరీస్ కూడా తన బ్యాటుకు పనిచెప్పగలడు.రాజస్థాన్ జట్టు బౌలింగ్ పరంగా పర్వాలేదనిపిస్తోంది. క్రిస్‌ మోరీస్ తొలి మ్యాచ్‌లో విఫలమయినా.. పుంజుకునే సత్తా అతడిలో ఉంది. యువ పేసర్ సకారియా ఆశలు రేపుతున్నాడు. గత మ్యాచులో కెప్టెన్ సంజు శాంసన్.. ఏకంగా 8 మందితో బౌలింగ్ చేయించాడు. అయితే ఒక ఓవర్ వేసి ఆకట్టుకున్న పరాగ్ చేత మరో ఓవర్ వేయించలేదు. ఇక ఫీల్డింగ్‌లోనూ రాజస్థాన్ మెరుగవ్వాల్సి ఉంది.

  మరోవైపు ఢిల్లీ జట్టులో ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు ఆడడంతో,రిషబ్ పంత్‌కి ఫస్ట్ మ్యాచ్‌లో పెద్దగా బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్, సీనియర్ ఆటగాడు అజింక్య రహానే ఉండనే ఉన్నారు. బౌలింగ్ పరంగా క్రిస్ ‌వోక్స్, అవేష్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీశారు. అయితే వెటరన్ స్పిన్నర్లు ఆర్ అశ్విన్, అమిత్ మిశ్రాలు గాడిలో పడాల్సి ఉంది. క్వారంటైన్ కారణంగా మొదటి మ్యాచ్‌కి దూరమైన కగిసో రాబాడ.. ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

  ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఢిల్లీ, రాజస్థాన్ జట్లు 22 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. 2019 నుంచి రాజస్థాన్‌తో నాలుగు మ్యాచ్‌ల్లో తలపడిన ఢిల్లీ.. నాల్గింటిలోనూ విజయాలు అందుకుంది. ఢిల్లీపై రాజస్థాన్ ఇప్పటి వరకూ చేసిన అత్యధిక స్కోరు 201 పరుగులుకాగా.. రాజస్థాన్‌పై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 196.

  తుది జట్లు :


  Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Rishabh Pant(w/c), Ajinkya Rahane, Marcus Stoinis, Chris Woakes, Ravichandran Ashwin, Lalit Yadav, Kagiso Rabada, Tom Curran, Avesh Khan   Rajasthan Royals (Playing XI): Manan Vohra, Sanju Samson(w/c), David Miller, Jos Buttler, Shivam Dube, Riyan Parag, Rahul Tewatia, Chris Morris, Chetan Sakariya, Jaydev Unadkat, Mustafizur Rahman


  Published by:Sridhar Reddy
  First published: