RR vs DC : తగ్గేదేలే.. తన ధరకు న్యాయం చేసిన క్రిస్ మోరిస్..రాజస్థాన్ దే విక్టరీ..

RR vs DC : తగ్గేదేలే.. తన ధరకు న్యాయం చేసిన క్రిస్ మోరిస్..రాజస్థాన్ దే విక్టరీ..

RR vs DC : ఈ సీజన్ లో బోణి కొట్టింది రాజస్థాన్ రాయల్స్. ఫస్ట్ మ్యాచ్ లో ఆఖరి బంతికి బోల్తా పడ్డ రాయల్స్.. ఈ సారి మాత్రం ఆ తప్పు చేయలేదు. ఈ ఏడాది వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రిస్ మోరిస్ తన డబ్బుకు న్యాయం చేశాడు. 18 బంతుల్లో 36 పరుగులు చేశాడు క్రిస్ మోరిస్.

  • Share this:
    ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్ కూడా ఇదే రీతిలో సాగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో క్రిస్ మోరిస్ సూపర్ బ్యాటింగ్ తో రాజస్థాన్ విక్టరీ కొట్టింది. 148 పరగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌ఆర్‌ జట్టు 42 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే కష్టాల్లో పడ్డ రాజస్థాన్ కు డేవిడ్ మిల్లర్ ఆదుకున్నాడు. స్టోక్స్ స్థానంలో జట్టులోకి వచ్చిన మిల్లర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 43 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అయితే, డేవిడ్ మిల్లర్ వికెట్ తో మ్యాచ్ మరోసారి ఢిల్లీ వైపు మొగ్గు చూపింది. అయితే, ఆఖర్లో క్రిస్ మోరిస్ సూపర్ బ్యాటింగ్ తో రాజస్థాన్ రాయల్స్ కు విక్టరీ అందించాడు. ఈ సీజన్ లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రిస్ మోరిస్ తన డబ్బుకు న్యాయం చేశాడు. 18 బంతుల్లో 36 పరుగులు చేశాడు క్రిస్ మోరిస్. అతని బ్యాటింగ్ లో నాలుగు సిక్సర్లు ఉన్నాయ్. అతనికి తోడుగా జై దేవ్ ఉనాద్కత్ సహకరించాడు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు వికెట్ల తో సత్తా చాటగా.. క్రిస్ వోక్స్ 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఈ విక్టరీతో ఈ సీజన్ లో పాయింట్ల ఖాతా తెరిచింది రాజస్థాన్ రాయల్స్.

    ఇక, మొదట, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీకి రాజస్థాన్ బౌలర్లు చుక్కలు చూపారు.రాజస్థాన్ రాయల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సూపర్ ఫీల్డింగ్ తోడవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. జయదేవ్ ఉనాద్కత్(3/15) సూపర్ స్పెల్‌కు ముస్తాఫిజుర్ రెహ్మాన్(2/29) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఒకానొక దశలో ఢిల్లీ కనీసం 130 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ కెప్టెన్ కెప్టెన్ రిషభ్ పంత్(32 బంతుల్లో 9 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 రన్స్ చేసింది.

    చివర్లో టామ్ కరన్(21), క్రిస్ వోక్స్(15 నాటౌట్) బౌండరీలు బాదారు. అయితే ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ సీజన్‌లో ఒక్క సిక్స్ కొట్టని తొలి జట్టుగా ఢిల్లీ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. రాజస్థాన్ బౌలర్లలో జయదేవ్, ముస్తాఫిజుర్‌కు తోడుగా క్రిస్ మోరిస్ ఓ వికెట్ తీశాడు. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఇద్దరు రనౌటయ్యారు. ఇక, రేపటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది ఢిల్లీ క్యాపిటల్స్.
    Published by:Sridhar Reddy
    First published: