IPL 2021 ROYAL CHALLENGERS BENGALURU BOWLER HARSHAL PATEL SHINES AGAIN AND HE PICKS HAT TRICK AGAINST MUMBAI INDIANS SRD
Harshal Patel Hat-Trick : భళా..హర్షల్ పటేల్..! హ్యాట్రిక్ తో చరిత్ర.. మూడో బౌలర్ గా రికార్డు..!(వీడియో)
Harshal Patel (Twitter)
Harshal Patel Hat-Trick : ఐపీఎల్ 2021లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bengaluru) జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ మెరిశాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపాడు.
ఐపీఎల్ 2021(IPL 2021) సెకండాఫ్ అంచనాలకు అందకుండా దూసుకుపోతోంది. హాట్ ఫేవరేట్స్ ముంబై ఇండియన్స్వరుస ఓటములతో ఏడో స్థానానికి పడిపోయింది. మరోవైపు అద్భుత విజయంతో.. మూడో స్థానానికి దూసుకెళ్లింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2021లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bengaluru) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు 54 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఇక, ఈ మ్యాచ్ లో RCBకి చెందిన హర్షల్ పటేల్ (Harshal Patel) చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ 2021 సీజన్లో హ్యాట్రిక్ సాధించాడు. ముంబై ఇండియన్స్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ పడగొట్టాడు. 17వ ఓవర్ మొదటి బంతికి హార్దిక్ పాండ్యా (3)ను, రెండో బంతికి కీరన్ పోలార్డ్ (7), మూడో బంతికి రాహుల్ చహర్ (0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ ఘనత అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ తరఫున హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ (రాజస్థాన్ రాయల్స్ 2010), శామ్యూల్ బద్రీ (ముంబై ఇండియన్స్ 2017)లు బెంగళూరు తరఫున హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు.
ఇక ఐపీఎల్ టోర్నీలో హ్యాట్రిక్ తీసిన 20వ బౌలర్‌గా హర్షల్ పటేల్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ టోర్నీలో మొదటగా హ్యాట్రిక్ తీసింది లక్ష్మిపతి బాలాజీ. 2008లో అప్పటి కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుపై బాలాజీ హ్యాట్రిక్ పడగొట్టాడు. అమిత్ మిశ్రా, మఖయ ఎంతినిలు కూడా 2008లోనే ఈ ఫీట్ అందుకున్నారు. 2009లో యువరాజ్ సింగ్ రెండు సార్లు, రోహిత్ శర్మ ఓసారి హ్యాట్రిక్ తీశారు.
ఇక, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ 54 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. బెంగళూరు జట్టులో గ్లెన్ మాక్స్వెల్ (56: 37 బంతుల్లో 6X4, 3X6), విరాట్ కోహ్లీ (51: 42 బంతుల్లో 3X4, 3X6) అర్ధ సెంచరీలతో రాణించారు. శ్రీకర్ భరత్ (32) ఫర్వాలేదనిపించాడు.
ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (43), క్వింటన్ డికాక్ (24) పరుగులు చేశారు. మిగతా వారు విఫలమవడంతో రోహిత్ సేన భారీ తేడాతో ఓడిపోయింది. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చేతులేత్తయడంతో ముంబైకి భారీ ఓటమి తప్పలేదు. ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్ దిశగా దూసుకెళ్లగా.. ముంబై పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి పడిపోయింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.