• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 ROYAL CHALLENGERS BANGALORE VS DELHI CAPITALS SAND STORM DELAYS PLAY IN AHMEDABAD SA

మైదానంలో ఈదురుగాలులు.. చూట్టూ కరోనా.. ఐపీఎల్ 2021 వాయిదా పడనుందా!

మైదానంలో ఈదురుగాలులు.. చూట్టూ కరోనా.. ఐపీఎల్ 2021 వాయిదా పడనుందా!

Narendra Modi Stadium

ఇప్పటికే కరోనా,బయోబబుల్ కారణంగా ఇబ్బంది పడుతున్న ఆటగాళ్ళుకు.. ప్రతికూత వాతావరణ పరిస్థితులు కూడా వారిని మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి.

  • Last Updated:
  • Share this:


    కరోనేనా కాదు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ఐపీఎల్ 2021 సీజన్‌ను ఇబ్బంది కరంగా మారాయి. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య నరేంద్ర మోదీ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు స్వల్ఫ అంతరాయం ఏర్పడింది. ఆర్‌సీబీ బ్యాటింగ్ అనంతరం మైదానంలో విచిన ఈదురుగాలుల కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను కొద్ది సేపు నిలిపివేశారు.
    ఈ కారణంగా ఢిల్లీ బ్యాటింగ్ కాస్త ఆలస్యంమైంది. ప్రస్తుతం మైదానంలో బలమైన గాలులు వీయడంతో పాటు మైదానం మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. ఇప్పటికే కరోనా,బయోబబుల్ కారణంగా ఇబ్బంది పడుతున్న ఆటగాళ్ళుకు.. ప్రతికూత వాతావరణ పరిస్థితులు కూడా వారిని మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి.

    భారత్‌లో పెరుగుతున్న కరోనాతో ఆందోళనతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆండ్రూ టై (రాజస్థాన్‌ రాయల్స్‌), కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు),రవిచంద్రన్ ఆశ్విన్ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత్‌లో కరోనా విజృంభణ కారణంగా పలు దేశాలు విమానాల రాకపోకలపై అంక్షలు విధించాయి. ముఖ్యంగా భారత్‌ వచ్చే ప్రయాణికుల విమానాలపై మే 15 వరకు నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్‌ మోరిసన్‌ మంగళవారం ప్రకటించారు. దీంతో ఐపీఎల్ భాగంమైన ఆ దేశ చెందిన వారిలో ఆందోళన మెుదలైంది. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. ఆటగాళ్ల పూర్తి భద్రత తమదేనని భరోసాను ఇచ్చింది. టోర్నీ అనంతరం ఆటగాళ్లను వారి స్వదేశాలకు చేర్చే బాధ్యత బోర్డుదే అని స్పష్టంచేసింది. ఈమేరకు బీసీసీఐ సీఓఓ హేమాంగ్‌ అమిన్‌ మంగళవారం ఆటగాళ్లకు బహిరంగ లేఖ రాశాడు.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు