IPL 2021 : కోహ్లీ, డివిలియర్స్ ల రన్నింగ్ రేస్.. ఆఖర్లో ట్విస్ట్..విజేత ఎవరంటే..

కోహ్ల - డివిలియర్స్

IPL 2021 : ప్రతి సీజన్ లోనూ ఫేవరెట్స్ గా బరిలోకి దిగడం.. ఆ తర్వాత చతికిలబడటం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)కి అలవాటైపోయింది. కోహ్లీ (Virat Kohli) , డివిలియర్స్ (AB De Villiers) లాంటి టాప్ ప్లేయర్స్ ఉన్నా..ఆ జట్టు ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ ను ముద్ధాడాలేదు. దీంతో, ఈ సారైనా టైటిల్ కొట్టాలన్న కసితో కన్పిస్తోంది కోహ్లీసేన.

 • Share this:
  నయా జోష్ తో ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేందుకు ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ సిద్ధమవుతోంది. ప్రాంచైజీలన్నీ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయ్. ఇక, ఇంత వరకు టైటిల్ కొట్టని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) నయా జోష్ తో ఈ సీజన్ కోసం రెడీ అవుతోంది. పేపర్ పులులు అన్న ముద్ర చేరిపేయాలన్న కసితో ఉంది కోహ్లీసేన. గతేడాది సీజన్ లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసి ప్లే ఆఫ్ వరకు వచ్చింది. అయితే, కీలక ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ (Sun Risers Hyderabad) చేతిలో ఓడి ఒట్టి చేతులతోనే వెనుదిరిగింది. దీంతో ఈ సారి ఐపీఎల్ వేలంలో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మ్యాక్స్ వెల్, కైల్ జేమీసన్ లాంటి ఆల్ రౌండర్లను కొనుగోలు చేసి జట్టును స్ట్రాంగ్ గా మార్చుకుంది. తాజాగా కోహ్లి (Virat Kohli), డివిలియర్స్‌ (AB De Villiers), దేవ్‌దూత పడిక్కల్‌ మధ్య ట్విటర్‌ వేదికగా జరిగిన వీడియో చాటింగ్‌ నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. మొదట కోహ్లి తన ఇంట్లోని ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీసున్న వీడియోను షేర్‌ చేశాడు. ఇది చూసిన డివిలియర్స్‌ వావ్‌ కోహ్లి.. నీ కసరత్తు పరుగులు తీస్తుంది.. ఇంట్లో నుంచే ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నావు..నేను కూడా అన్ని ప్యాక్‌ చేశా.. ఐపీఎల్‌ ఆడేందుకు వస్తున్నా అంటూ కామెంట్‌ చేశాడు. దీనిక బదులుగా కోహ్లి..'' ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా వికెట్ల మధ్య నువ్వు వేగంగా పరిగెత్తగలుగుతావు.. నేను నిన్ను అందుకోవాలి..'' అని తెలిపాడు. దీనికి డివిలియర్స్‌.. ''అయితే ఇప్పుడు మనిద్దరం సరదాగా రన్నింగ్‌ రేస్‌ పెట్టకుందాం ఎవరు గెలుస్తారో చూద్దాం'' అని తెలిపాడు. రన్నింగ్‌ రేస్‌లో కోహ్లి, డివిలియర్స్‌ పోటీ పడి పరిగెత్తారు.. ఒకదశలో కోహ్లిని డివిలియర్స్‌ దాటేశాడు.

  ఇంతలో ఒక ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. కోహ్లి, డివిలియర్స్‌ను దాటుకుంటూ దేవదూత్‌ పడిక్కల్‌ వేగంగా పరిగెత్తుతూ చివరన ఉన్న లైన్‌ను టచ్‌ చేశాడు. ''మీకన్నా ముందు నేను ప్రాక్టీస్‌ ప్రారంభించా.. అందుకే ఇంత వేగంగా పరిగెత్తా .. అయినా సరే మీలాంటి సీనియర్‌ క్రికెటర్లతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా'' అంటూ దేవదూత్‌ పేర్కొన్నాడు. అయితే ఇదంతా పూమా క్రికెట్‌ ప్రమోషన్‌లో భాగంగా చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇక, ఏప్రిల్ 9 న ముంబై ఇండియన్స్ తో తలపడనుంది కోహ్లీసేన. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ 14 వ సీజన్ కు తెరలేవనుంది. చెన్నై వేదికగా ఈ రెండు జట్టు తలపడునున్నాయ్. ఈ ఏడాది ఐపీఎల్ కోసం ఆరు వేదికల్ని సిద్ధం చేసింది బీసీసీఐ. ప్రతి జట్టు కూడా ప్రత్యామ్నాయ వేదికల్లోనే ప్రత్యర్ధులతో తలపడనున్నాయ్. ఇప్పటికే ఈ సీజన్ కోసం ప్రాక్టీస్ ను షూరు చేశాయ్ చెన్నై, కోల్ కతా జట్లు.
  Published by:Sridhar Reddy
  First published: