Home /News /sports /

IPL 2021 : కేదార్ జాదవ్ పాయే..రాబిన్ ఊతప్ప వచ్చే..చెన్నై టీమ్ పై ఫ్యాన్స్ ఫైర్

IPL 2021 : కేదార్ జాదవ్ పాయే..రాబిన్ ఊతప్ప వచ్చే..చెన్నై టీమ్ పై ఫ్యాన్స్ ఫైర్

రాబిన్ ఉతప్ప(Robin Uthappa)

రాబిన్ ఉతప్ప(Robin Uthappa)

IPL 2021 : ఐపీఎల్ 2021 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయ్. వచ్చే నెల మినీ వేలం జరగనుండటంతో అన్ని జట్ల ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయ్.

  ఐపీఎల్ 2021 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయ్. వచ్చే నెల మినీ వేలం జరగనుండటంతో అన్ని జట్ల ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయ్. ఇప్పటికే రిటైన్, రిలీజ్ ప్లేయర్ల లిస్ట్ ను ప్రకటించిన జట్టు యజమాన్యాలు వేలం కోసం కసరత్తులు మొదలుపెట్టాయ్. షేన్ వాట్సన్‌, హర్భజన్ సింగ్, పీయూస్ చావ్లా, మురళీ విజయ్, కేదార్ జాదవ్, మోనూ సింగ్‌‌ల రూపంలో ఆరుగుర్ని వేలంలోకి విడిచిపెట్టింది చెన్నై సూపర్ కింగ్స్ . అయితే లేటెస్ట్ గా ట్రేడ్ రూపంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్పని టీమ్‌లోకి తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై చెన్నై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో కేదార్ జాదవ్‌ను తీసుకొచ్చారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో రూ.3 కోట్లకు రాబిన్ ఊతప్పని కొనగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ అప్‌కమింగ్ సీజన్ కోసం రిటైన్ చేసుకున్నట్లు ప్రకటించింది. కానీ ఆ తర్వాత చెన్నై జట్టు విజ్ఞప్తి మేరకు ఊతప్పను వదులుకున్నామని ఆ జట్టు సీఈవో జాక్‌లష్ మెక్రం గురువారం ఓ ప్రకటనలో తెలిపాడు.

  ప్రస్తుతం సయ్యద్​ ముస్తాక్​ అలీలో కేరళకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాబిన్​ ఓ మోస్తరుగా ఆడుతున్నాడు. కానీ, అతడి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎస్​కే ఊతప్పను కొనుక్కుంది. ఇక ఊతప్పను జట్టులోకి తీసుకోవడాన్ని చెన్నై అభిమానులు తప్పుబడుతున్నారు. ఏ ప్రాతిపదికన అతన్ని జట్టులోకి తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. గత సీజన్‌లో నిరాశపర్చిన కేదార్ జాదవ్, మురళీ విజయ్‌లు లేరని సంతోషపడుతుంటే వాళ్లకు మించిన వాడిని తీసుకొచ్చారని సెటైర్లు పేల్చుతున్నారు. 35 ప్లస్ అనే ఊతప్పను తీసుకున్నారా? అని మండిపడుతున్నారు. యువ ఆటగాళ్లను తీసుకోవాలని ఉండదా? అని నిలదీస్తున్నారు.


  రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2020 సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన రాబిన్ ఊతప్ప .. 16.33 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 19 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండగా.. కనీసం ఒక్కటి కూడా గెలిపించే ఇన్నింగ్స్‌ లేదు. ఐపీఎల్ ఆరంభ సీజన్( 2008) నుంచి ఆడుతున్న రాబిన్ ఊతప్ప.. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పుణె వారియర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక తాజా ఒప్పందం ప్రకారం ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటి వరకూ 189 మ్యాచ్‌లు ఆడిన ఊతప్ప.. 129.99 స్ట్రైక్‌రేట్‌తో 4,607 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

  చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ ప్లేయర్లు : ధోనీ(కెప్టెన్), సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీషన్, ఫాఫ్ డూప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, సామ్ కరన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, జోష్ హజెల్ వుడ్, శార్దూల్ ఠాకూర్, కరన్ శర్మ, ఆసిఫ్, ఇమ్రాన్ తాహిర్, సాయి కిషోర్, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి

  వదులుకున్న ప్లేయర్లు: కేదార్ జాదవ్, షేన్ వాట్సన్, పియూష్ చావ్లా, మురళీ విజయ్, మోను కుమార్, హర్భజన్ సింగ్
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chennai Super Kings, IPL, IPL 2021, Rajasthan Royals

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు