Home /News /sports /

IPL 2021 - RCB Vs SRH: ఉత్కంఠ పోరులో సన్ ‌రైజర్స్ హైదరాబాద్ విజయం..

IPL 2021 - RCB Vs SRH: ఉత్కంఠ పోరులో సన్ ‌రైజర్స్ హైదరాబాద్ విజయం..

(Image Credit - Twitter/IPL)

(Image Credit - Twitter/IPL)

ఐపీఎల్ 2012లో(IPL 2021) బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరుపై (Royal Challengers Bangalore) సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) విజయం సాధించింది.

    ఐపీఎల్ 2012లో(IPL 2021) బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరుపై (Royal Challengers Bangalore) సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో సన్ రైజర్స్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ జట్టు.. బెంగళూరు ముందు 142 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. అయితే హైదరాబాద్ బౌలర్స్ పొదుపుగా బౌలింగ్ చేశారు. చివరి ఓవర్‌లో బెంగళూరు జట్టు విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. భువనేశ్వర్ అద్భుతమైన బౌలింగ్‌ చేశాడు. దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 137 పరుగులకు పరిమితమైంది.

    142 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లి(5).. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ అఖరి బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్టియన్ కూడా కొద్దిసేపటికే పెవిలియన్ చేరాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన క్రిస్టియన్ సిదార్థ్ కౌలు బౌలింగ్‌‌లో వృద్దిమాన్ సాహా చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్(12) 7 ఓవర్‌లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 7 ఓవర్‌లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ దేవ్‌దత్ పడిక్కల్‌తో కలిసి స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. దాటిగా ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచాడు. అయితే 15వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ రనౌట్ అయ్యాడు. 25 బాల్స్ ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్.. 2 సిక్స్‌లు, 3 ఫోర్ల్‌లతో 40 పరుగులు చేశాడు. ఆ తర్వాత పడిక్కల్(41) రషీద్ ఖాన్‌ వేసిన 17 ఓవర్‌లో అబ్దుల్ సమద్ చేతికి చిక్కాడు.

    ఆ తర్వాత షాబాజ్ అహ్మద్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే జాసన్ హోల్డర్ వేసిన 19 ఓవర్‌‌లో షాబాజ్ అహ్మద్ పెవిలియన్ చేరాడు. ఇక, చివరి ఓవర్‌లో బెంగళూరు జట్టు విజయానికి 13 పరుగులు అవసరం అయ్యాయి. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన భువనేశ్వర్.. తొలి మూడు బంతులను పొదుపుగా వేశాడు. కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. అయితే నాలుగో బంతికి డి విలియర్స్ సిక్సర్ బాదడంతో బెంగళూరుకు విజయంపై ఆశలు చిగురించాయి. అయితే ఐదో బంతికి పరుగులు ఇవ్వలేదు. ఇక, చివరి బంతికి బెంగళూరు జట్టు కేవలం ఒక్క పరుగు చేసింది. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 137 పరుగులు చేసింది. డివిలియర్స్ (19), గార్టన్(2) నౌటౌట్‌గా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జాసన్ హోల్డర్, సిదార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.





    అంతకు ముందు బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్స్‌కు ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(13) జార్జ్ గార్టన్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విలియమ్సన్.. జాసన్ రాయ్‌తో కలిసి సన్ రైజర్స్ స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వికెట్ పడకుండా స్కోర్‌ను పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. అయితే 12వ ఓవర్‌లో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో విలియమ్సన్ (31) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రియమ్ గార్గ్ (15) 15 ఓవర్‌లో డాన్ క్రిస్టియన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో సన్‌రైజర్స్ మరో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ జాసన్ రాయ్ (44) పెవిలియన్‌కు చేరాడు. దీంతో సన్ రైజర్స్ 15 ఓవర్లు ముగిసేరికి 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఇక, ఆ తర్వాత అబ్దుల్‌ సమద్‌ (1), వృద్దిమాన్ సాహా (10) తక్కువ వ్యవధిలోనే వికెట్లు కోల్పోయారు. జాసన్ హోల్డర్(16) ఇన్నింగ్స్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. రషీద్ ఖాన్ (7) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్‌లో హర్షల్ పటేల్ మూడు వికెట్లు, డాన్ క్రిస్టియన్ 2 వికెట్లు, చాహల్, గార్టన్‌లు చెరో వికెట్ తీశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: IPL 2021, Royal Challengers Bangalore, SRH, Sunrisers Hyderabad

    తదుపరి వార్తలు