Home /News /sports /

IPL 2021 RCB VS SRH LIVE UPDATES ROYAL CHALLENGERS BANGALORE VS SUNRISERS HYDERABAD LIVE SCORE RCB OPT TO BOWL SU

Ipl 2021 RCB Vs SRH: రాయల్ చాలెంజర్స్ వర్సెస్ సన్‌రైజర్స్.. టాస్ గెలిచిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే..

Photo Credit : twitter

Photo Credit : twitter

ఐపీఎల్ 2021 లో (IPL 2021) భాగంగా బుధవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టులు తలపడుతున్నాయి.

    ఐపీఎల్ 2021 లో (IPL 2021) భాగంగా బుధవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టులు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు జట్టు 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ‌జట్టు ఈ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శనను కనబరుస్తోంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది.

    ఐపీఎల్ ఇప్పటివరకు రెండు జట్లు 19 మ్యాచ్‌ల్లో తలపడగా.. హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. బెంగళూరు 8 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.  ప్రస్తుత సీజన్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో  6 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాదించింది.

    తుది జట్లు..
    సన్‌రైజర్స్ హైదరాబాద్- జాసన్ రాయ్, వృద్దిమాన్ సాహా, కేన్ విలిమయ్సన్ (కెప్టెన్), ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్









    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- విరాట్ కోహ్లి(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్, గ్లెన్ మాక్స్ వెల్, ఏబీ డివిలియర్స్, డాన్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టాన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజువేంద్ర చాహల్
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: IPL 2021, Royal Challengers Bangalore, SRH, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు