• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 RCB VS RR LIVE UPDATES ROYAL CHALLENGERS BANGALORE WON THE TOSS AND OPT FIELD FIRST SRD

RCB vs RR : టాస్ కోహ్లీసేనదే...కీలక మార్పులతో బరిలోకి రెండు జట్లు..

RCB vs RR : టాస్ కోహ్లీసేనదే...కీలక మార్పులతో బరిలోకి రెండు జట్లు

RCB vs RR : ఫ్యాన్స్ ను అలరించేందుకు ఐపీఎల్ లో మరో పోరు సిద్దమైంది. ఈ సీజన్ లో దుమ్మురేపుతున్న కోహ్లీసేనతో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కోహ్లీసేన విజయాలకు ఈ మ్యాచ్ లో నైనా బ్రేక్ పడేనా..? లేదా.. రాజస్థాన్ రాయల్స్ తన పరాజయాల్ని కంటిన్యూ చేసేనా..?

  • Share this:
    ఐపీఎల్ 2021 సీజన్ లో మరికాసేపట్లో మరో కీలక పోరు జరగనుంది. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది రాజస్థాన్ రాయల్స్. ఇక, టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది.అటు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, ఇటు బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటుతున్న కోహ్లీ సేన బలంగా ఉంది. ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ.. తర్వాత సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌, కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్‌రైడర్స్‌పై ఈజీగా విక్టరీలతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లింది. ఇదే జోరును కొనసాగిస్తూ రాజస్థాన్‌ను ఓడించాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో రెండింటిలో ఓడి డీలా పడింది. గత పోరులో చెన్నై చేతిలో చిత్తయిన ఆ టీమ్​ ఆర్‌‌‌‌‌‌‌‌సీబీని ఓడించి ఆత్మ విశ్వాసం పెంచుకోవాలని భావిస్తోంది. స్టార్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ ఏబీ డివిలియర్స్‌‌‌‌‌‌‌‌తో పాటు కొత్త టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన గ్లెన్‌‌‌‌‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌లో విజృంభించడంతో ఆర్‌‌సీబీ ఫుల్‌‌‌‌‌‌‌‌ జోష్‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఇద్దరూ భీకర ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో బాగానే ఆడిన విరాట్‌‌‌‌‌‌‌‌ భారీ స్కోరు బాకీ ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరూ రాణించినా బెంగళూరుకి బ్యాటింగ్‌లో తిరుగుండదు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఆర్‌‌‌‌‌‌‌‌సీబీకి తిరుగులేకుండాపోయింది. పేసర్లు మహ్మద్ సిరాజ్‌‌‌‌‌‌‌‌, హర్షల్‌ పటేల్‌‌‌‌‌‌‌ చాలా పొదుపుగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కైల్ జెమీసన్ పరుగులిస్తున్నా కీలక వికెట్లు తీస్తున్నాడు. చాహల్ కూడా గాడిలో పడటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

    మరోవైపు రాజస్థాన్ టీమ్ ఆశలన్నీ ఆ జట్టు కెప్టెన్ సంజూశాంసన్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌ తర్వాతి రెండు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లోనూ ఫెయిలయ్యాడు. సంజూ మరోసారి చెలరేగితే రాజస్థాన్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. జోస్‌‌‌‌‌‌‌‌ బట్లర్‌‌‌‌‌‌‌‌, మిల్లర్ రాణిస్తున్నా.. ఇతర బ్యాట్స్‌మన్ విఫలమవుతున్నారు. జయదేవ్ ఉనాద్కత్, చేతన్ సకారియా, క్రిస్ మోరీస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌తో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. కానీ పరుగులిచ్చుకోవడాన్ని నియత్రించుకోవాలి.

    ఇక, ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు హోరాహోరీగా ఉంది. ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లు జరగ్గా ఇరు జట్లు చెరో 10 విజయాలు సాధించాయి. మరో మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

    తుది జట్లు :

    Rajasthan Royals (Playing XI): Jos Buttler, Manan Vohra, Sanju Samson(w/c), Shivam Dube, David Miller, Riyan Parag, Rahul Tewatia, Chris Morris, Shreyas Gopal, Chetan Sakariya, Mustafizur Rahman


     Royal Challengers Bangalore (Playing XI): Virat Kohli(c), Devdutt Padikkal, Shahbaz Ahmed, Glenn Maxwell, AB de Villiers(w), Washington Sundar, Kyle Jamieson, Kane Richardson, Harshal Patel, Mohammed Siraj, Yuzvendra Chahal


    Published by:Sridhar Reddy
    First published: