• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 RCB VS RR LIVE UPDATES ROYAL CHALLENGERS BANGALORE WON BY 10 WICKETS SRD

RCB vs RR : దేవదత్ పడిక్కల్, కోహ్లీ దంచెన్.. బెంగళూరు గెలిచెన్..

RCB vs RR : దేవదత్ పడిక్కల్, కోహ్లీ దంచెన్.. బెంగళూరు గెలిచెన్..

RCB vs RR : దేవదత్ పడిక్కల్, కోహ్లీ దంచెన్.. బెంగళూరు గెలిచెన్..

RCB vs RR : ఈ సీజన్ లోఅప్రతిహతంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అదురు బెదురు లేకుండా విజయాల మోత మోగిస్తోంది కోహ్లీసేన. ప్రత్యర్థి ఎవరైనా సరే.. విజయం మాదే అంటూ ధీమాగా ముందుకెళుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

  • Share this:
    ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ పర్వం కొనసాగుతోంది. అప్రతిహతంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. అదురు బెదురు లేకుండా విజయాల మోత మోగిస్తోంది కోహ్లీసేన. ఇక, ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. రాజస్థాన్ రాయల్స్ సెట్ చేసిన 178 పరుగుల టార్గెట్ ను ఉఫ్ అని ఊదేసింది. దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ విజృంభణ తో మరో 21 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ను ఫినిష్ చేసింది కోహ్లీసేన. దేవదత్ పడిక్కల్ 52 బంతుల్లో 101 పరుగులు చేయగా.. కోహ్లీ 47 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఈ విక్టరీతో 8 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ తమ టాప్ ప్లేస్ ను మరింత పటిష్టం చేసుకుంది.178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ మొదట నుంచే దూకుడు ప్రదర్శించింది. కోహ్లీ, పడిక్కల్ వీర బాదుడుకు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ముఖ్యంగా ఆర్‌సీబీ యంగ్ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ మెరుపులు మెరిపించాడు. సూపర్ సెంచరీతో వారెవ్వా అన్పించాడు. రాహుల్‌ తెవాటియా వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్లో పడిక్కల్‌ వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. వీరిద్దరి దెబ్బకి ఆర్‌సీబీ 11 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఇదే దూకుడు ప్రదర్శించి మ్యాచ్ ను పూర్తి చేశారు.

    అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ పోరాడే స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా ఆల్‌రౌండర్లు మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 రన్స్ చేసి.. బెంగళూరు ముందు 178 పరుగుల లక్ష్యంను ఉంచింది. గత సీజన్‌ వరకు బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన ఆల్‌రౌండర్ శివమ్ దూబే (46; 32 బంతుల్లో 5×4, 2×6) చెలరేగాడు. రాహుల్ తేవాతియా (40; 23 బంతుల్లో 4×4, 2×6)మెరవగా.. రియాన్ పరాగ్ (25; 16 బంతుల్లో 4×4), కెప్టెన్ సంజు శాంసన్ (21; 18 బంతుల్లో 2×4, 1×6) రాణించారు. బెంగళూరు పేసర్లు మొహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.

    ఈ సీజన్ లో బెంగళూరు ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే ఈ సారి కప్ కొట్టడం ఖాయం. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతుండంటంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సాలా కప్ నమదే అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: