Home /News /sports /

IPL 2021 RCB VS DC WILD CELEBRATIONS BROKE OUT IN THE RCB CAMP AFTER SRIKAR BHARAT SUPER SIXER OFF THE FINAL BALL TO LEAD HIS TEAM TO A THRILLING VICTORY SRD

Virat Kohli : తగ్గేదే లే... విరాట్ కోహ్లీ రచ్చ అంటే ఇలాగే ఉంటుంది..! వైరల్ వీడియో..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Virat Kohli : విరాట్ కోహ్లీ జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. మైదానంలో తన సెలబ్రేషన్స్ తో ఎంత ఎనర్జీగా ఉంటాడో మనందరికీ తెలిసిందే. కానీ, ఢిల్లీపై సూపర్ విక్టరీ తర్వాత విరాట్ కోహ్లీ చేసిన రచ్చ నెక్ట్స్ లెవల్.

    ఐపీఎల్‌ 2021 (IPL 2021 Latest Updates)లో ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన శ్రీకర్‌ భరత్‌ మ్యాచ్‌ హీరోగా మారిపోయాడు. తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ (Srikar Bharat)(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్నందుకుంది. పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతికి ఆర్‌సీబీ విజయానికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. సిక్స్ కొట్టి కేఎస్ భరత్.. ఢిల్లీకి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ ఐపీఎల్‌లో 100 విజయాలను పూర్తి చేసుకుంది. ఈ ఘనతను అందుకున్న నాలుగో జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), శిఖర్ ధావన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించారు.

    ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/25) రెండు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, డాన్ క్రిస్టియన్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసింది. కేఎస్ భరత్‌కు అండగా మ్యాడ్ మ్యాక్సీ(33 బంతుల్లో 8 ఫోర్లతో 51 నాటౌట్) చెలరేగాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశాడు.


    ఇక, ఇన్నింగ్స్ తో హీరోగా మారాడు శ్రీకర్ భరత్‌. వైజాగ్ కు చెందిన భరత్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో భరత్‌ లాంగాన్‌ మీదుగా భారీ సిక్స్‌ కొట్టడంతో ఆర్‌సీబీ సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా కోహ్లి విజయద్వానాలు చేస్తూ మైదానంలోకి పరిగెత్తి మిగిలిన ఆటగాళ్లతో సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


    ఈ విక్టరీతో 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది కోహ్లీసేన. చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు 18 పాయింట్లతో సమానంగా నిలిచినప్పటికీ.. బెటర్ రన్ రేట్ తో రెండో స్థానం దక్కించుకుంది ధోనీసేన. ఇక, కోహ్లీసేన తమ ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ సోమవారం జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. క్వాలిఫైయిర్ -1 లో ఓడిన జట్టుతో ఆడాల్సి ఉంటుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2021, Royal Challengers Bangalore, Viral Video, Virat kohli

    తదుపరి వార్తలు