హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 : రేపు ఒకే సమయంలో రెండు మ్యాచ్ లు..! మీరు ఇలా చూడొచ్చు..!

IPL 2021 : రేపు ఒకే సమయంలో రెండు మ్యాచ్ లు..! మీరు ఇలా చూడొచ్చు..!

కానీ మిగతా జట్లలోనే ఈ విషయంలో అనిశ్చితి నెలకొంది. దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్ (Ishan kishan), వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్ (KS Bharath) లాంటి దేశీయ మేటీ ఆటగాళ్లు వేలంలో ఉన్నప్పటికీ.. కొంతమంది అంతర్జాతీయ స్టార్లు కూడా వీరితో పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2022 సీజన్‌ వేలంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న అంతర్జాతీయ వికెట్ కీపర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

IPL 2021 : ఇక, రేపు ఐపీఎల్ 2021 లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్‌లు ఏకకాలంలో జరగనున్నాయ్. IPL లో గ్రూప్ ఫేజ్ చివరి రోజు ఏకకాలంలో మ్యాచ్‌లు ఆడడం ఇదే మొదటిసారి.

  ఐపీఎల్ 2021(IPL 2021 Season Latest Updates) సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు (Play Off Race) ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చెన్నై (CSK), ఢిల్లీ (DC), బెంగళూరు (RCB) ప్లే ఆఫ్స్ చేరుకోగా.. నాలుగో స్థానం కోసం అసలు పోరాటం మొదలైంది. నాలుగో స్థానం కోసం కోల్ కతా, ముంబై లు పోరాటం చేస్తున్నాయ్. ఈ రెండు టీమ్స్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయ్. ఇక, రేపు ఐపీఎల్ 2021 లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్‌లు ఏకకాలంలో జరగనున్నాయ్. IPL లో గ్రూప్ ఫేజ్ చివరి రోజు ఏకకాలంలో మ్యాచ్‌లు ఆడడం ఇదే మొదటిసారి. మునుపటి షెడ్యూల్ ప్రకారం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్‌తో ఒక రోజు ఆటలో మధ్యాహ్నం 3:30 కి తలపడాల్సి ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సాయంత్రం 7:30 కి జరగాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఈ రెండు మ్యాచ్‌లు సాయంత్రం 7:30 కి జరుగుతాయి.

  ఇక, ఈ మ్యాచ్ లు ప్రసారమయ్యే ఛానళ్లు..:

  * RCB Vs DC : స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ - 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ -1, స్టార్ స్పోర్ట్స్ - 1 తెలుగు/ తమిళ్/ కన్నడ.

  * MI Vs SRH : స్టార్ స్పోర్ట్స్ -2, స్టార్ స్పోర్ట్స్ -3, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ గోల్డ్ -2

  * ఇక, హాట్ స్టార్ ఈ రెండు మ్యాచ్ లను స్ట్రీమింగ్ చేస్తోంది.

  ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్‌లో మిగిలిన నాలుగో స్థానం సాధించే అవకాశం ఎక్కువగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లకే ఉంది. అందులోనూ కోల్‌కతా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ముంబై, కోల్‌కతా ఆరేసి విజయాలతో 12 పాయింట్లు సాధించాయి. కేకేఆర్‌కు మెరుగైన రన్‌రేట్‌ ఉండటంతో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. తమ ఆఖరి మ్యాచుల్లో రాజస్థాన్‌తో కేకేఆర్‌.. సన్‌రైజర్స్‌తో ముంబై తలపడతాయి.

  రాజస్థాన్‌ మీద కేకేఆర్‌ గెలిచి.. సన్‌రైజర్స్‌ మీద ముంబై ఓడిపోతే ఎలాంటి ఇబ్బంది లేకుండానే కోల్‌కతాకు ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు అవుతుంది. రాజస్థాన్‌పై కేకేఆర్‌, సన్‌రైజర్స్‌ మీద ముంబై భారీ విజయాలు సాధిస్తే.. ఇరు జట్ల పాయింట్లు 14 అవుతాయి. అప్పుడు నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఎక్కువ రన్‌రేట్‌ ఉన్న జట్టు ప్లే ఆఫ్స్‌లోకి వెళుతుంది. ఒకవేళ రాజస్థాన్‌ మీద కేకేఆర్‌ ఓడిపోయి, సన్‌రైజర్స్‌ మీద ముంబై గెలిస్తే.. అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా రోహిత్ సేన ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లిపోతుంది.

  రాజస్థాన్‌ చేతిలో కేకేఆర్‌, సన్‌రైజర్స్‌పై ముంబై ఓటమిపాలైతే.. పంజాబ్‌ కూడా రేసులోకి వస్తుంది. పంజాబ్‌ తన చివరి మ్యాచ్‌లో చెన్నై మీద భారీ విజయం సాధిస్తే.. ప్లే ఆఫ్స్‌ నాలుగో స్థానం ఎంట్రీ కాస్త కష్టంగా మారే ఛాన్స్ ఉంది. దీంతో చివరి వరకు నాలుగో స్ధానం ఖరారు అయ్యేలా లేదు. నాలుగో బెర్త్ ఎవరు దక్కించుకోనున్నారో తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Delhi Capitals, IPL 2021, Mumbai Indians, Royal Challengers Bangalore, Sports, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు