Home /News /sports /

Harshal Patel : హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించేనా..? అరుదైన రికార్డుకు చేరువలో ఆర్సీబీ బౌలర్..

Harshal Patel : హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించేనా..? అరుదైన రికార్డుకు చేరువలో ఆర్సీబీ బౌలర్..

Harshal Patel (Twitter)

Harshal Patel (Twitter)

Harshal Patel : ఐపీఎల్ 2021 సీజన్ (IPL 2021 Season Latest Updates) లో తన సూపర్ బౌలింగ్ ప్రదర్శనతో దుమ్మురేపుతున్నాడు హర్షల్ పటేల్ (Harshal Patel). తన బౌలింగ్ తో ఆర్సీబీని ప్లే ఆఫ్ రేస్ లో నిలిపాడు ఈ పేస్ గుర్రం.

    ఐపీఎల్ 2021 సీజన్ (IPL 2021 Season Latest Updates) లో తన సూపర్ బౌలింగ్ ప్రదర్శనతో దుమ్మురేపుతున్నాడు హర్షల్ పటేల్ (Harshal Patel). తన బౌలింగ్ తో ఆర్సీబీని ప్లే ఆఫ్ రేస్ లో నిలిపాడు ఈ పేస్ గుర్రం. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటివరకు హర్షల్‌ పటేల్ ఐపీఎల్ 2021లో 13 మ్యాచులు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇప్పటివరకు టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రెండో స్థానానికి పడిపోయాడు. బుమ్రా ఐపీఎల్ 2020 సీజన్లో 15 మ్యాచుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఈ లిస్ట్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 2017లో భువీ 14 మ్యాచులలో 26 వికెట్లు తీశాడు. ఇక, ఇవాళ జరగనున్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు హర్షల్ పటేల్.

    ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో ఉన్నాడు. 2013 సీజన్లో బ్రావో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఈ లిస్ట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కాగిసో రబడా రెండో స్థానంలో ఉన్నాడు. 2020 సీజన్లో రబడా 30 వికెట్లు తీశాడు. 29 వికెట్లతో హర్షల్ పటేల్ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. 2011 సీజన్లో ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ లసిత్ మలింగా 28 వికెట్లు తీసి నాలుగో ఉండగా.. 2013లో జేమ్స్ ఫాల్కనర్ అదే 28 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

    ప్రస్తుతం బెంగళూరు లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఢిల్లీతో తాడోపేడో తేల్చుకోనుంది. అలానే ప్లే ఆఫ్స్ చేరింది కాబట్టి మరో రెండు మ్యాచ్లు ఆడనుంది. దీంతో, హర్షల్ పటేల్ మరో మూడు వికెట్లు పడగొడితే.. డ్వేన్ బ్రావోతో కలిసి అగ్రస్థానంలో నిలుస్తాడు. నాలుగో వికెట్ పడగొడితే మాత్రం మరో రికార్డు ఖాతాలో వేసుకుంటాడు.

    ఇది కూడా చదవండి : Ind Vs Pak : మరోసారి నీచబుద్ధిని బయటపెట్టిన దాయాది.. పాకిస్థాన్‌ జెర్సీతో సరికొత్త వివాదం..

    గ‌త వారమే ఐపీఎల్‌లో ఓ అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ అత్య‌ధిక వికెట్ల‌ను హ‌ర్ష‌ల్ అధిగ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్‌లో ప‌ర్పుల్ క్యాప్ హ‌ర్ష‌ల్‌కు ద‌క్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అత‌ని త‌ర్వాత రెండో స్థానంలో ఢిల్లీ బౌల‌ర్ అవేష్ ఖాన్ 22 వికెట్ల‌తో ఉన్నాడు. అత‌ని ప్ర‌ద‌ర్శ‌న చూసిన ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్‌, అన‌లిస్ట్ హ‌ర్షాభోగ్లే.. హ‌ర్ష‌ల్‌ను టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక చేస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Delhi Capitals, IPL 2021, Royal Challengers Bangalore

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు