IPL 2021 RCB BATSMEN DEVDUTT PADIKKAL AVAILABLE FOR THE ENCOUNTER AGAINST SUNRISERS HYDERABAD SA
IPL 2021: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ అభిమానులకు గుడ్‌న్యూస్!
Photo Credit : Twitter
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ ఎడిషన్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్,రాయల్ ఛాలేంజర్స్ నేడు పోరుకు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ ఎడిషన్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్,రాయల్ ఛాలేంజర్స్ నేడు పోరుకు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఉత్సాహాంతో రాయల్ ఛాలెంజర్స్ బరిలోకి దిగుతుండగా.. మెుదటి మ్యాచ్ ఓటమితో పాటలు నేర్చుకుని పక్కా వ్యూహం సమరానికి సిద్దమైంది. లీగ్ మొదటి వారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటివరకు, అన్ని జట్లు కనీసం ఒక్కొ మ్యాచ్ ఆడాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) ను లీగ్ దశలో ఆరో మ్యాచ్ ఆడనున్నాయి.
తొలి మ్యాచ్‌లో బెంగళూర్ ముంబయి ఇండియన్స్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్.. కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ యువ సంచలనం దేవదత్ పాడికల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న పాడికల్ తిరిగి జట్టుతో కలవనున్నారు. మెుదటి మ్యాచ్‌లో ఆర్సిబి తరుపున ఓపెనర్‌గా వాషింగ్టన్ సుందర్ ,కెప్టెన్ కోహ్లీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సన్‌రైజ్‌తో జరిగే మ్యాచ్‌లో పాడికల్ బరిలోకి దిగనున్నట్లు RCB డైరెక్టర్ మైక్ హెస్సన్ తెలిపారు. పడికల్ తిరిగి జట్టులోకి చేరనున్నాడు. వెల్లడించాడు.
Mike Hesson on DDP : ‘He will be considered for the game and most likely play!’ ❤️#SRHvRCB#IPL2021
"ప్రస్తుతం నేను పూర్తిగా కొలుకున్నాను. 100 శాతం పూర్తి ఫిట్‌తో ఉన్నాను" అని ఆర్సీబీ తన ట్విటర్ ఖాతాలో వీడియోలో తెలిపాడు ఇక ఐపీఎల్ 2020 దేవ్‌దత్ స్టార్-స్టడెడ్ బ్యాటింగ్ లైనప్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ఐపీఎల్‌లోనూ అదే ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నాడు. చూడాలి ఎవరి స్థానంలో పడికల్‌ను జట్టులోకి తీసుకుంటారో.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.