IPL 2020: విరిగిన బెన్ స్టోక్స్ చెయ్యి... ఐపీఎల్‌ను వీడనున్న స్టార్ ప్లేయర్!

Ben Stokes

నొప్పి కారణంగా బౌలింగ్ మాత్రం చేయలేదు. అత్యసర పరిస్థితిల్లో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ తర్వాత డకౌట్‌గా వెనుదిరిగాడు. తాజాగా వైద్య పరీక్షల్లో అతని ఎడమ చేతి విరిగిందని తెలుస్తోంది.

  • Share this:


    రాజస్థాన్ రాయల్స్ భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ టోర్నీకి దూరం కానున్నాడు. పంజాబ్‌పై ఓటమితో బాధలో ఉన్న రాజస్థాన్‌కు ఈ పరిణామం ఊహించనది. ఐపీఎల్ మ్యాచ్ నెం 3లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో రాజస్థాన్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డారు బెన్ స్టోక్స్ . రియాన్ పరాగ్ బౌలింగ్‌లో క్రిస్ గేల్ భారీ షాట్‌ ఆడగా దానిని బెన్ స్టోక్స్ లాంగాన్‌లో డైవ్ చేసి అద్భుత క్యాచ్‌గా మలిచాడు. ఈ సమయంలోనే అతని ఎడమ చేతికి గాయమైంది. తర్వాత ఈ గాయం తీవ్రంగా బాధించిన అలానే ఆటలో కొనసాగాడు.

    నొప్పి కారణంగా బౌలింగ్ మాత్రం చేయలేదు. అత్యసర పరిస్థితిల్లో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ తర్వాత డకౌట్‌గా వెనుదిరిగాడు. తాజాగా వైద్య పరీక్షల్లో అతని ఎడమ చేతి విరిగిందని తెలుస్తోంది. స్టోక్స్‌ సంబంధించిన పూర్తి రిపోర్టుల గురువారం రానున్నాయి. ఈ విషయంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆరాతీసింది. అతని గాయానికి సంబంధించిన రీపోర్టుల కోసం ఎప్పటికప్పుడు ఐపీఎల్ నిర్వహాకులును అడిగి తెలుసుకుంటుంది. ఒకవేళ అతని గాయం తీవ్రమైనది అయితే వెంటనే ఐపీఎల్ వీడనున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌లో కీలక ఆటగాడిగా ఉన్న అతను ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఆ జట్టు కీలక బౌలరైనా జోఫ్రా ఆర్చర్ టోర్నీకి గైహాజరు కాగా ఇక బెన్‌స్ట్రోక్స్ కనుక తప్పుకుంటే ఈ టోర్నీలో రాజస్థాన్ ప్రయాణం నామమాత్రంగానే ఉంటుందని చెప్పాలి.
    Published by:Rekulapally Saichand
    First published: