• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 RAJASTHAN ROYALS DONANTED ONE MILLION DOLLARS FOR FIGHT AGAINST CORONA IN INDIA SRD

Rajasthan Royals : సాహో రాజస్ధాన్ రాయల్స్..కరోనాపై పోరు కోసం భారీ విరాళం..

Rajasthan Royals : సాహో రాజస్ధాన్ రాయల్స్..కరోనాపై పోరు కోసం భారీ విరాళం..

Rajasthan Royals : మానావాళి నుదుటి మీద రాస్తున్న మృత్యుశాసనానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా దేశమంతటా ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్‌ లభించక బాధితులు నానా అవస్థలు పడుతున్నారు.

  • Share this:
    దేశమంతా కరోనాతో అల్లాడిపోతోంది. ముఖ్యంగా సెకండ్ వేవ్.. దేశంలోని ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. మానావాళి నుదుటి మీద రాస్తున్న మృత్యుశాసనానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా దేశమంతటా ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్‌ లభించక బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఐపీఎల్ ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) గొప్ప మనసు చాటుకుంది. తమ దేశ కరోనా బాధితుల కోసం1 మిలియన్ డాలర్లు (దాదాపు 7.5 కోట్లు) సాయం చేస్తున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. రాయల్స్ జట్టు యజమానులు, ఆటగాళ్లు మరియు మేనేజ్మెంట్ కలిపి 1 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని రాయల్స్ తమ అధికారిక ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. " కరోనా వైరస్ మహమ్మారితో భారత ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనాతో బాధపడుతున్న దేశ ప్రజల కోసం తక్షణ సహాయం అందిస్తున్నాం. రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమానులు, ఆటగాళ్లు మరియు మేనేజ్మెంట్ నుంచి 1 మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తున్నాం" అని ఆర్‌ఆర్ ట్వీట్ చేసింది. కొద్ది క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్ అయింది. దీంతో అభిమానులు రాజస్థాన్ రాయల్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాయల్స్ చేసిన పనికి సెల్యూట్ కొడుతున్నారు.

    ఇప్పటికే కరోనాపై పోరులో ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ తన వంతు సాయంగా 50 వేల డాలర్లను భారత పీఎం కేర్స్‌ ఫండ్‌కు అందజేసిన విషయం తెలిసిందే. ఇక ఆసీస్‌ మాజీ పేసర్‌, ప్రముఖ వ్యాఖ్యాత బ్రెట్‌ లీ సైతం ఒక బిట్‌ కాయిన్‌ను విరాళంగా అందించనున్నట్లు తెలిపాడు. క్రికెటర్లే కాకుండా సినీ ప్రముఖులు కూడా తన వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు కొందరు విరాళాలు అందజేశారు.


    మరోవైపు శ్రీవత్స్‌ గోస్వామి తన వంతు సాయం చేశాడు. దేశంలో ఆక్సిజన్‌ కొరతతో కరోనా బాధితులు అల్లాడుతున్న సమయంలో.. ప్రాణవాయువు సరఫరాకై రూ. 90 వేలు విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని 'డొనాటేకర్ట్‌' అనే చారిటి ఆర్గనైజేషన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. కష్ట సమయంలో అందరూ ఏకతాటిపై నిలబడాలని, వీలైనంత మేర సాయం చేయాలని గోస్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. మన భారత క్రికెటర్లు గతంలో సాయం చేశారు.. ఈ పరిస్థితుల్లో కూడా సాయం చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: