IPL 2021 - KKR Won : వాటే మ్యాచ్.. వాటే మ్యాచ్.. ఉత్కంఠ పోరులో KKR సూపర్ విక్టరీ..

Venkatesh Iyer (BCCI)

IPL 2021 - KKR Won : లీగ్ స్టేజీలోనే అద్భుత విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. కీలక పోరుల్లో చేతులేత్తేసింది. ఫలితం, తొలి కప్ అందుకోవాలన్న వారి ఆశలు అడియాసలయ్యాయ్.

 • Share this:
  ఐపీఎల్ 2021 (IPL 2021 Season Latest Updates) లో భాగంగా.. షార్జా వేదికగా జరిగిన క్వాలిఫైయర్ -2 (DC Vs KKR) మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ దుమ్మురేపింది. ఉత్కంఠగా జరిగిన పోరులో అద్భుత విజయంతో ఫైనల్ లోకి దర్జాగా అడుగుపెట్టింది. ఇక, లీగ్ స్టేజీలో టేబుల్ టాపర్ గా సత్తా చాటిన ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్ ల్లో చేతులేత్తేసింది.  కోల్ కతా 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో, మరోసారి కప్ లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గతేడాది ఫైనల్ లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి క్వాలిఫైయర్ -2 లో ఓడిపోయింది. ఉత్కంఠ పోరులో ఆఖరి ఓవర్ లో సిక్సర్ కొట్టి కోల్ కతాను విజయతీరాలకు చేర్చాడు రాహుల్ త్రిపాఠి. 136 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతాకు ఓపెనర్లు మరోసారి అదిరే ఆరంభాన్ని అందించారు.

  కీలక మ్యాచులో కోల్‌కతా ఓపెనర్లు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyer) కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో అర్థ సెంచరీ పూర్త చేసి కోల్ కతా విక్టరీని ఖాయం చేశాడు. మరో ఎండ్ లో శుభ్ మన్ గిల్ కూడా అయ్యర్ కు సహకారం అందించి.. కోల్ కతాకు విజయ బాటలు వేశాడు. అయితే, వెంకటేశ్ అయ్యర్ (41బంతుల్లో 55 పరుగులు) చేసి.. రబాడా బౌలింగ్ లో స్మిత్ కి క్యాచ్ ఔటవ్వడంతో ఒక్కసారిగా కోల్ కతా ఇన్నింగ్స్ లో లయ తప్పింది.

  వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది కోల్ కతా నైట్ రైడర్స్. శుభ్ మన్ గిల్ అవేశ్ ఖాన్ బౌలింగ్ ఔటవ్వగా.. నితీశ్ రానా నోర్ట్జే బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. ఇక, ఆఖర్లో రబాడా సూపర్ ఓవర్ వేశాడు. అతడు వేసిన 18 ఓవర్ లో కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది. అలాగే, దినేశ్ కార్తీక్ ను పెవిలియన్ పంపాడు రబాడా. అయితే, ఆఖరి ఓవర్ లో ఏడు పరుగులు కావాల్సిన సమయంలో అశ్విన్ బౌలింగ్ వేశాడు. ఫస్ట్ మూడు బంతుల్లో షకీబుల్ హసన్, సునీల్ నరైన్ వికెట్లు తీశాడు. అయితే, రాహుల్ త్రిపాఠి అద్భుత సిక్సర్ తో కోల్ కతా కు సూపర్ విక్టరీ అందించాడు.


  ఇక, అంతకు ముందు కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్లు మరోసారి చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ప్రత్యర్థి ముందు 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్లకు 135 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్(27 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 30 నాటౌట్), శిఖర్ ధావన్(39 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

  కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు తీయగా.. ఫెర్గూసన్, శివం మావి తలో వికెట్ పడగొట్టారు.మావి వేసిన చివరి ఓవర్‌లో అయ్యర్, 4, 6తో 15 పరుగులు పిండుకోవడంతో ఢిల్లీ 135 పరుగులైనా చేయగలిగింది.

  ఇది కూడా చదవండి: " ఆ దిగ్గజ క్రికెటర్ పై ఉన్న గౌరవం చచ్చిపోయింది " .. క్రిస్ గేల్ సంచలన వ్యాఖ్యలు..

  ఈ విక్టరీతో శుక్రవారం జరిగే ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది కోల్ కతా నైట్ రైడర్స్. ఈ ఏడాది కూడా కొత్త చాంపియన్ ను చూడాలనుకున్న అభిమానులకు, మాజీ క్రికెటర్లు నిరాశే ఎదురైంది. ఎందుకంటే కోల్ కతా ఇప్పటికే రెండు టైటిళ్లు నెగ్గగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మూడు టైటిళ్లు ఉన్నాయ్. ఇక, మెగా ఫైట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: