Home /News /sports /

IPL 2021 QUALIFIER 2 DC VS KKR LIVE UPDATES KOLKATA KNIGHT RIDERS WON THE TOSS AND OPT TO BOWL FIRST SRD

IPL 2021 - Qualifier 2 : టాస్ గెలిచిన కోల్ కతా.. ఢిల్లీలోకి స్టార్ ఆల్ రౌండర్..

IPL 2021 - Qualifier 2

IPL 2021 - Qualifier 2

IPL 2021 - Qualifier 2 : ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుండగా.. ఓడిన టీమ్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమింస్తుంది. లీగ్‌ దశలో అత్యధిక విజయాలతో ప్లే ఆఫ్స్‌ చేరి.. క్వాలిఫయర్‌-1లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) చేతిలో ఓడిన ఢిల్లీ తుదిపోరుకు చేరాలని తహతహలాడుతోంది.

ఇంకా చదవండి ...
  ఐపీఎల్ 2021 (IPL 2021 Season Latest News) సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇక, కాసేపట్లో అసలు సిసలు పోరుకు తెరలేవనుంది. ఫైనల్ కానీ ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయ్యాయ్. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ టామ్ కర్రన్ స్ధానంలో స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ ను జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుండగా.. ఓడిన టీమ్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమింస్తుంది. లీగ్‌ దశలో అత్యధిక విజయాలతో ప్లే ఆఫ్స్‌ చేరి.. క్వాలిఫయర్‌-1లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) చేతిలో ఓడిన ఢిల్లీ తుదిపోరుకు చేరాలని తహతహలాడుతోంది.ఇక నాకౌట్‌ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఇంటి దారి పట్టించిన కోల్‌కతా అదే జోరులో టైటిల్‌ ఫైట్‌కు అర్హత సాధించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. క్రికెట్ ప్రేమికులు కూడా ఈ మెగా సమరం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  హెడ్ టు హెడ్ రికార్డ్స్ :

  ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకూ ఢిల్లీ, కోల్‌కతా జట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 15 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించగా.. 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు. ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశలోనూ ఈ రెండు జట్లూ రెండు సార్లు తలపడగా.. చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఇక ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న షార్జా పిచ్‌ స్పిన్‌కి అనుకూలంగా ఉండనుంది.

  లీగ్‌ దశలో అన్ని జట్లన్నింటికంటే ఎక్కువ విజయాలు సాధించి ఢిల్లీనే. ఆలాంటి జట్టు క్వాలిఫయర్‌-1లో ఒత్తిడిని జయించలేక ఓడిపోయింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ కీలక సమయంలో ఫామ్‌ కోల్పోయాడు. పృథ్వీ ఫామ్‌ అందుకోవడం సంతోషాన్నిచ్చే విషయమే. ఈ ఇద్దరు మంచి ఆరంభం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

  శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్ పంత్, శిమ్రాన్ హెట్‌మయర్‌ మెరుపులు ఒక్కో మ్యాచుకే పరిమితం అయ్యాయి. ఈ త్రయం చెలరేగాల్సిన అవసరం ఎంతో ఉంది. అక్షర్‌ పటేల్, అన్రిచ్ నోర్జ్‌, అవేష్‌ ఖాన్ నిలకడగా రాణిస్తుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. అయితే రబాడ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఆటగాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మాత్రం ఢిల్లీకి తిరుగుండదు.


  కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులో వెంకటేశ్‌ అయ్యర్‌ ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి వెంకీ అద్భుత ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు పార్ట్‌టైం బౌలర్‌గా, ఫీల్డర్‌గానూ జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. క్వాలిఫయర్‌-2లో కూడా ఈ జోడీపై భారీ అంచనాలు ఉన్నాయి. రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణాలు కూడా కోల్‌కతా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రిపాఠి, రాణాల దూకుడైన బ్యాటింగ్ ప్రత్యర్థికి పెద్ద సవాలే. సీనియర్లు ఇయాన్ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌ ఇప్పటివరకు తమ సత్తాచాటలేదు.

  ఇది కూడా చదవండి : " హైదరాబాదీ ఆంటీలు ఇలా ఉండాలి " .. వైరలవుతున్న సానియా మీర్జా ఫన్నీ వీడియో..

  గాయం కారణంగా జట్టుకు దూరమయిన స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్ స్థానంలో ఆడిన షకిబ్‌ ఉల్ హాసన్ సత్తాచాటాడు.పేస్‌ విభాగంలో లుకీ ఫెర్గూసన్‌, శివమ్ మావి కూడా రాణిస్తున్నారు. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి నిలకడ, దూకుడుతో ఆకట్టుకుంటున్న కోల్‌కతాకు ఢిల్లీని ఓడించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

  తుది జట్లు :

  ఢిల్లీ క్యాపిటల్స్‌: శిఖర్ ధావన్‌, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్ పంత్‌ (కెప్టెన్‌), శిమ్రాన్ హెట్‌మయర్‌, మార్కస్ స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌, ఆర్ అశ్విన్‌, అన్రిచ్ నోర్జ్‌, కగిసో రబాడా, అవేష్‌ ఖాన్‌.

  కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ గిల్, వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌ (వికెట్ కీపర్), షకిబ్‌ ఉల్ హాసన్, సునీల్ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, లుకీ ఫెర్గూసన్‌, శివమ్ మావి.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Delhi Capitals, Dinesh Karthik, IPL 2021, Kolkata Knight Riders, Rishabh Pant, Shikhar Dhawan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు