IPL 2021 QUALIFIER 2 DC VS KKR LIVE UPDATES DELHI CAPITALS SETS NORMAL TARGET IN FRONT OF KOLKATA KNIGHT RIDERS SRD
IPL 2021 - DC Vs KKR : KKR అదుర్స్ .. ఢిల్లీ బెదుర్స్.. టార్గెట్ ఎంతంటే..!
DC Vs KKR
IPL 2021 - DC Vs KKR : షార్జా వేదికగా జరుగుతున్న క్వాలిఫైయర్ - 2 (DC Vs KKR) మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లకు కోల్ కతా బౌలర్లు చుక్కలు చూపారు. స్లో పిచ్ పై పరుగులు చేయడానికి ఢిల్లీ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు.
షార్జా వేదికగా జరుగుతున్న క్వాలిఫైయర్ - 2 (DC Vs KKR) మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లకు కోల్ కతా బౌలర్లు చుక్కలు చూపారు. స్లో పిచ్ పై పరుగులు చేయడానికి ఢిల్లీ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో ఏ ఒక్కరూ ఫాస్ట్ గా ఆడింది లేదు. ధావన్ (Shikhar Dhawan) 39 బంతుల్లో 36 పరుగులు, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) 27 బంతుల్లో 30 పరుగులతో రాణించారు. ఆఖర్లో హెట్మేయర్ 10 బంతుల్లో 17 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లతో సత్తా చాటాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ఏ దశలోనూ దూకుడుగా ఆడలేదు. ఓపెనర్ పృథ్వీ షా (18 పరుగులు, 12 బంతులు, 2 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి ఢిల్లీ టీంను దెబ్బ తీశాడు. ఇక, స్టొయినిస్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు శిఖర్ ధావన్. ఢిల్లీ బౌలర్లు బౌండరీ బంతులు తక్కువ వేయడంతో ఢిల్లీ క్యాంప్ లో ఒత్తిడి పెరిగింది.
ఇక, దూకుడుగా ఆడటానికి ప్రయత్నించి స్టోయినిస్ (18 పరుగులు, 23 బంతులు, 1 ఫోర్) చేసిన శివమ్ మావీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే.. శిఖర్ ధావన్ (36 పరుగులు, 39 బంతులు, 1 ఫోర్, 2 సిక్సులు) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి మరోసారి వికెట్ పడగొట్టి ఢిల్లీ టీంను కోలుకోని దెబ్బ తీశాడు. ఇక, దూకుడుగా ఆడటానికి వచ్చిన పంత్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఆరు పరుగులు చేసిన పంత్.. ఫెర్గ్యూసన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆఖర్లో హెట్ మేయర్ మెరుపులు మెరిపించడంతో ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.
లీగ్ దశలో అత్యధిక విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి.. క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) చేతిలో ఓడిన ఢిల్లీ తుదిపోరుకు చేరాలని తహతహలాడుతోంది.ఇక నాకౌట్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఇంటి దారి పట్టించిన కోల్‌కతా అదే జోరులో టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించాలని చూస్తోంది.
హెడ్ టు హెడ్ రికార్డ్స్ :
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకూ ఢిల్లీ, కోల్‌కతా జట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 15 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించగా.. 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు. ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశలోనూ ఈ రెండు జట్లూ రెండు సార్లు తలపడగా.. చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.