• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 PUNJAB KINGS LATEST BATTING SENSATION SHAHRUKH KHAN PRACTICE VIDEO GOES VIRAL SRD

IPL 2021 : చూశారా.. మా జట్టులో కూడా పొలార్డ్ ఉన్నాడు...ఇక సిక్సర్ల వర్షమే..

IPL 2021 : చూశారా.. మా జట్టులో కూడా పొలార్డ్ ఉన్నాడు...ఇక సిక్సర్ల వర్షమే..

Photo Credit : Twitter

IPL 2021 : పేసర్‌, స్పిన్నర్‌ అన్న తేడా లేకుండా మైదానం నలుమూలలా భారీ సిక్సర్లు బాదుతున్నాడు. బంతిని స్టాండ్స్‌ దాటించడమే లక్ష్యంగా అతడు ఆడుతున్నాడు. ఈ కుర్రాడు మా జట్టుకు పొలార్డ్ లాంటి వాడు.

  • Share this:
    ఒకటి.. రెండు.. మూడు.. ఐపీఎల్ (IPL 2021) కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి కొద్ది గంటల్లో ఫ్యాన్స్ అలరించడానికి మీ ముందుకు రాబోతోంది. ఫస్ట్ ఫైట్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో రాయల్ ఛాలెంజర్స్ (Royal Challengers Bangalore) తలపడనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక, ఈ ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ యంగ్ తరంగ్ షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) పై అందరి కన్ను పడింది. పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే మా జట్టులో కూడా పొలార్డ్ ఉన్నడంటూ షారుఖ్ ఖాన్ ను పొగిడిన సంగతి తెలిసిందే.. అయితే, ఈ చెన్నై కుర్రాడు నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అదరగొట్టాలని ఉవ్విళూరుతున్న షారుఖ్.. అందుకు తగ్గట్టుగానే నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. ఫోర్లు బాదడం కన్నా సిక్సర్లపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నాడు షారుక్. పేసర్‌, స్పిన్నర్‌ అన్న తేడా లేకుండా మైదానం నలుమూలలా భారీ సిక్సర్లు బాదుతున్నాడు. బంతిని స్టాండ్స్‌ దాటించడమే లక్ష్యంగా అతడు ఆడుతున్నాడు. లేటెస్ట్ గా ప్రాక్టీస్ మ్యాచ్‌లో షారుక్‌ ఖాన్ మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడుతున్న వీడియోను పంజాబ్‌ కింగ్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేసింది. అంతేకాదు ఆ వీడియోకు మంచి క్యాప్షన్‌ జోడించింది. " షారుక్‌.. మా కొత్త సిక్స్‌ హిట్టింగ్‌ మెషీన్‌. ఫోర్‌ కొట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడు" అని రాసుకొచ్చింది. ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఆరంభానికి ముందు ఇది ట్రైలర్‌ మాత్రమే అన్నట్లు షార్ట్‌ వీడియో క్లిప్‌ను పంజాబ్‌ షేర్‌ చేసింది. మొత్తానికి పంజాబ్‌ ప్రాంచైజీ తమ ఫ్యాన్స్‌లో ఇలా ఉత్తేజం నింపింది.

    ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో షారుక్ ఖాన్​​ను పంజాబ్ కింగ్స్ జట్టు​ రూ.5.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఈ సీజన్‌లో అతనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల పంజాబ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే.. షారుక్‌పై చేసిన వ్యాఖ్యల బట్టి చూస్తే అతనిపై ప్రాంచైజీకి ఏమేరకు అంచనాలున్నాయో స్పష్టమవుతుంది. 25 ఏళ్ల షారుక్‌ దేశవాళీ క్రికెట్‌లో పెద్ద స్కోర్లేమీ చేయకపోయినప్పటికీ.. సునాయాసంగా సిక్సర్లు బాదగల సామర్ధ్యం ఉన్న కారణంగా పంజాబ్‌ అతన్ని కొనుగోలు చేసింది.


    షారుఖ్ ఖాన్‌కు ఇదే మొదటి ఐపీఎల్ సీజన్. ఐపీఎల్ 2020 వేలంలో అతనికి నిరాశే ఎదురైంది. ఏ ప్రాంచైజీ అతడిని కొనుగోలు చేయలేదు. దానికి ఏమాత్రం నిరాశ చెందని ఈ తమిళనాడు క్రికెటర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇరగదీశాడు. సెమీఫైనల్లో 19 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అంతేకాదు తమిళనాడు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తనదైన బ్యాటింగ్‌తో ఆకట్టుకొని ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. కనీస ధర రూ. 20లక్షలు ఉంటే.. ఏకంగా రూ. 5 కోట్ల 25 లక్షలకు ఇతర ప్రాంచైజీలతో పోటీపడి మరీ పంజాబ్ కొనుగోలు చేసింది. ఇక గతేడాది సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో ఆరో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం టీమ్ లో బోలెడంత మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. దీంతో ఈ సారి పంజాబ్ కు మెరుగైన అవకాశాలు ఉన్నాయ్.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు