హోమ్ /వార్తలు /క్రీడలు /

Arjun Tendulkar : ఖేల్ ఖతం..దుకాణం బంద్..ఆటలో అరటి పండుగా మిగిలిన అర్జున్ టెండూల్కర్..

Arjun Tendulkar : ఖేల్ ఖతం..దుకాణం బంద్..ఆటలో అరటి పండుగా మిగిలిన అర్జున్ టెండూల్కర్..

Arjun Tendulkar : ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. ఖడ్గం మూవీలో రవి తేజ డైలాగ్ గుర్తుంది కదా. ఆ సినిమాలో రవి తేజకు తాను అనుకున్న ఒక్క ఛాన్స్ దొరికిందేమో గానీ.. పాపం.. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు మాత్రం నిరాశే ఎదురైంది.

  భారత్ లో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజు రోజుకి కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఆక్సిజన్, బెడ్ల కొరతతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా సెగ ఐపీఎల్ 2021 సీజన్ కు కూడా తగిలింది. పటిష్టమైన బయోబబుల్ ను కూడా ఛేదించి కరోనా ఎంట్రీ ఇచ్చింది. వరుసగా, ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో బీసీసీఐ నిలిచింది. దీంతో ఐపీఎల్ 2021 సీజన్ కు నిరవధిక వాయిదా వేసింది. అయితే, ఈ వార్త ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ కు షాకిచ్చిందట. ఎందుకు అనుకుంటున్నారా..? కారణం అర్జున్ టెండూల్కర్. ఈ ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అర్జూన్ టెండూల్కర్ ను కనీస ధర రూ.20 లక్షలకు దక్కించుకుంది ముంబై ఇండియన్స్. అయితే, ఒక్క మ్యాచ్ లో కూడా అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకోలేదు. మిగతా మ్యాచ్ ల్లో ముంబై అదరగొట్టి.. ప్లే ఆఫ్స్ చేరితే..ఆఖరి లీగ్ మ్యాచ్ ల్లో ముంబై.. ప్రయోగాలు చేసి ఉండేది. అప్పుడు.. అర్జున్ కు జట్టులో చోటు దక్కి ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కరోనా దెబ్బకి.. ఈ సీజన్ కే ఏసరు వచ్చింది. ఒక వేళ ఐపీఎల్ ను సెప్టెంబర్ లో నిర్వహించినా.. అప్పుడు ఇదే పరిస్థితి ఉండకపోవచ్చు. మొత్తానికి ఒక మ్యాచ్ కూడా ఆడకుండానే అర్జున్ టెండూల్కర్.. కరోనా రూపంలో నిరాశ ఎదురైంది. అర్జున్ తో పాటు సచిన్ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

  క్రికెట్ గాడ్, భారత క్రికెట్ దిగ్గజంగా కోట్లాది క్రీడాభిమానుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. అయితే, సచిన్ తనయుడు అర్జున్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అర్జున్ టెండూల్కర్ పేరు గత నాలుగైదు ఏళ్లుగా వినిపిస్తోంది. కానీ.. టీమ్‌లోకి అతని ఎంపిక లేదా పేలవ ప్రదర్శనపైనే చర్చ జరుగుతూ మాత్రమే వినిపించేది.

  ఐపీఎల్ కు ముందు ఓ స్థానిక లీగ్ మ్యాచ్ లో చెలరేగాడు. అంతకుముందు.. విజయ్ హాజారే ట్రోఫిలో సెలక్ట్ అయినా.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో అర్జున్ టెండూల్కర్‌ని తీసుకునేందుకు ముంబై ఇండియన్స్ మాత్రమే ఆసక్తి కనబర్చింది. దీనిపై అప్పట్లో విమర్శలు భారీగానే వచ్చాయ్. సచిన్ తనయుడు కాబట్టే.. జట్టులోకి తీసుకున్నారని.. విమర్శలు చేశారు. ఇప్పుడేమో.. తన టాలెంటో ఏంటో చూపిద్దామనుకునే సరికి.. అసలకే ఎసరు వచ్చింది. కరోనా రూపంలో .. అర్జున్ టెండూల్కర్ కి పెద్దగానే దెబ్బ పడిందని చెప్పొచ్చు.

  First published:

  Tags: Arjun Tendulkar, IPL 2021, Mumbai Indians, Sachin Tendulkar

  ఉత్తమ కథలు