• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 PLAYING IPL WILL BE DIFFICULT AS ECB INDICATED BEN STOKES SA

ఇక ఐపీఎల్ ఆడటం కష్టమే.. మా ఆటగాళ్ళు అదే ఆలోచిస్తున్నారు

Ben Stokes

ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అనే దానిపై ఇప్పటివరకు సమాచారం లేదు. ఇంగ్లాండ్ బోర్డు వివరించినట్టుగా ఇంగ్లీష్ ఆటగాళ్ళు విశ్రాంతి దొరకడం చాలా కష్టమన్నారు స్ట్రోక్స్

  • Share this:


    కరోనా కారణంగా మధ్య నిలిచిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ తిరిగి ప్రారంభిండంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తిరిగి ఐపీఎల్ ఆడేందుకు చాలా మంది విదేశీ క్రికెటర్లు సందేహిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ ప్రధాన ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ కూడా స్పందించాడు. రెండో షెడ్యూల్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఆడటం కష్టమేనని అన్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్‌ గాయం కారణంగా మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనంతరం స్వదేశానికి చేరుకొని శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్‌‌పై పలు అంతర్జాతీయ పత్రికలలో వస్తున్న కథనాలపై స్పందించాడు.

    ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అనే దానిపై ఇప్పటివరకు సమాచారం లేదు. ఇంగ్లాండ్ బోర్డు వివరించినట్టుగా ఇంగ్లీష్ ఆటగాళ్ళు విశ్రాంతి దొరకడం చాలా కష్టమైన పని. ఈ ఏడాది అనంతరం జరిగే ఐపీఎల్‌ ఆడడానికి నేను చాలా ఆసక్తి ఉన్నానని.. ఈ సీజన్‌లో ఆరంభంలోనే రాజస్థాన్‌ రాయల్స్‌‌ని వీడిపోవడం చాలా బాధగా అనిపించింది. టోర్నీ వాయిదా అనంతరం ఆటగాళ్ళు అందరూ త్వరగా కలుసుకున్నారని" స్టోక్స్‌ పేర్కొన్నాడు.
    Published by:Rekulapally Saichand
    First published: