హోమ్ /వార్తలు /క్రీడలు /

పాప నవ్వింది.. విలియమ్సన్‌ ఇన్.. పాండే ఔట్.. సన్‌రైజర్స్ అందుకే గెలిచింది!

పాప నవ్వింది.. విలియమ్సన్‌ ఇన్.. పాండే ఔట్.. సన్‌రైజర్స్ అందుకే గెలిచింది!

manish pandey and williamsonand

manish pandey and williamsonand

మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం అంచులకు వరకు వెళ్ళి వరుస ఓటములను ఎదుర్కొన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో సూపర్ విక్టరీ కొట్టింది.

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత ఎట్టకేలకు మెుదటి విజయాన్ని అందుకుంది. చెన్నై చెపాక్ వేదికగా బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన 121 పరుగులు లక్ష్యాన్ని ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి సాధించింది. సన్‌రైజర్స్ ఓపెనర్స్ డేవిడ్‌ వార్నర్‌ (37; 37 బంతుల్లో 3x4, 1x6) జానీ బెయిర్‌స్టో (63 నాటౌట్‌; 56 బంతుల్లో 3x4, 3x6) సూపర్ బ్యాటింగ్. కేన్‌ విలియమ్సన్‌ (16 నాటౌట్‌; 19 బంతుల్లో) స్టాడింగ్ బ్యాటింగ్‌తో జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు.


మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం అంచులకు వరకు వెళ్ళి వరుస ఓటములను ఎదుర్కొన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో సూపర్ విక్టరీ కొట్టింది. ఈ విజయం జట్టుకు మంచి బూస్ట్‌ని ఇచ్చింది. యాజమాన్యం సంతోషంలో మునిగిపోయింది. ఇన్ని విజయం కోసం కసిగా ఎదురుచూసిన సన్‌రైజర్స్‌ అభిమానులు గాల్లో తేలియాడుతున్నారు. ఉన్నట్టు ఉండి జట్టు ఈ అద్భుత విజయం అందుకోవడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హాల్ చెస్తున్నారు. " మనం మ్యాచ్ గెలిచాం", 'మన పొలంలో మొలకలు వచ్చాయ్' ,"ముందుముందు దబిడిదిబిడే" 'హమ్మయ్య... గెలిచాం' అంటూ కామెంట్స్ చేస్తు్న్నారు.

ముఖ్యంగా జట్టు అనుహ్య ఓటములతో నిరాశలో మునిగిపోయిన కావ్య మారన్‌పై సెటైర్లు వేశారు. " అబ్బా సాయిరాం.. మా 'కావ్య మారన్' పాప నవ్వింది' 'ఎట్టకేలకు కావ్య మారన్ ఈరోజు నవ్వింది' అంటూ ట్వీట్ చేశారు

120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్ కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్‌కి కష్టమైన పిచ్‌పై జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఓపెనర్ వార్నర్ స్పిన్నర్ ఫాబియన్ అలెన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి మయాంక్ అగర్వాల్ చేతికి చిక్కినప్పటికి... ఆ తర్వాత విలియమ్‌సన్‌తో కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ను ముందు తీసుకెళ్ళి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే దీనిపై మీమ్స్ పెలుతున్నాయి. మనీష్ పాండే ఔట్.. విలయమ్‌సన్‌తోనే ఈ విజయం సాధ్యమైందని అంటున్నారు.

First published:

Tags: IPL 2021, Kings XI Punjab, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు