• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 PBKS VS RCB LIVE UPDATES ROYAL CHALLENGERS BANGALORE WON THE TOSS AND OPT TO FIELD FIRST SRD

PBKS vs RCB : టాస్ గెలిచిన కోహ్లీసేన.. పంజాబ్ జట్టులో మూడు మార్పులు

PBKS vs RCB : టాస్ గెలిచిన కోహ్లీసేన.. పంజాబ్ జట్టులో మూడు మార్పులు

PBKS vs RCB : వరుస విజయాల్ని కంటిన్యూ చేయాలని ఒక జట్టు.. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి ఫామ్ లోకి రావాలని మరొక జట్టు. కోహ్లీ వర్సెస్ రాహుల్ పోరు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Share this:
    ఐపీఎల్ 2021 సీజన్ లో మరి కాసేపట్లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి పటిష్ట జట్టుతో తలపడనుంది పంజాబ్ కింగ్స్. ఈ సీజన్ లో కోహ్లీసేన దుమ్మురేపుతుండగా.. రాహుల్ సేన తడబడుతోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్ ల్లో ఐదింట్లో నెగ్గి సూపర్ జోష్ లో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరోవైపు ఆరు మ్యాచ్ ల్లో కేవలం రెండింట్లో మాత్రమే నెగ్గి.. ఆరోస్థానంలో నిలిచింది పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, బెంగళూరు ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఒక మ్యాచ్ మినహా.. విరాట్ కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ ఇద్దరూ రాణిస్తుండటం కోహ్లీసేనకు ప్లస్ పాయింట్. ఈ ఇద్దరిలో ఒకరు ధాటిగా ఆడుతూ టీమ్‌కి మెరుగైన స్కోరుని అందిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదజు. ఆఖర్లో మెరుపులు మెరిపించగల సత్తా కైల్ జెమీసన్ కు ఉంది. మొత్తానికి కోహ్లీసేన బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది.బౌలింగ్ పరంగా కూడా బెంగళూరు బాగానే ఉంది. హర్షల్ పటేల్ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. పరుగులు ఇస్తున్నా.. వికెట్లు కూడా పడగొడుతున్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 37 పరుగులు సమర్పించుకున్న తర్వాత.. ఢిల్లీతో గత మ్యాచ్‌లో మళ్లీ లయ అందుకున్నాడు. మహ్మద్ సిరాజ్, కైల్ జెమీసన్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే డెత్ ఓవర్లలో మాత్రం తేలిపోతున్నారు. స్పిన్నర్ చాహల్ తన స్పిన్ మాయ ఇప్పటివరకు చేయలేదు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. వీరిద్దరూ కూడా ఫామ్ అందుకుంటే బెంగళూరు మరో విజయం ఖాతాలో వేసుకోవచ్చు.

    పంజాబ్ బ్యాటింగ్ లైనప్ పేపరు మీద స్ట్రాంగ్ గా ఉంది. అయితే, అసలు సమయంలోనే ఆ జట్టు బ్యాట్స్ మెన్ తడబడుతున్నారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ పవర్‌ ప్లేలో దూకుడుగా ఆడుతున్నారు. క్రిస్‌ గేల్ మ్యాచుకు అనుగుణంగా ఆడుతున్నాడు. అయితే దీపక్ హుడా, నికోలస్ పూరన్ హిట్టింగ్ చేస్తున్నా.. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడటం లేదు. యువ హిట్టర్ షారూక్ ఖాన్ బంతిని బలంగా బాదుతున్నా.. ఫినిషర్ రోల్‌ని పోషించడం లేదు. మిడిల్ ఆర్డర్ ఆడితే పంజాబ్ మెరుగైన స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. పంజాబ్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ పరుగులు కట్టడి చేస్తున్నా.. వికెట్లు మాత్రం పడగొట్టడం లేదు. ఇక మిడిల్ ఓవర్లలో పరుగులు ఎక్కువగా ఇస్తున్నారు. ఒక ఎండ్‌లో స్పిన్నర్ రవి బిస్ణోయ్ పొదుపుగా బౌలింగ్ చేస్తుంటే.. మరో ఎండ్ నుంచి దీపక్ హుడా ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు.

    ఐపీఎల్‌లో బెంగళూరు, పంజాబ్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలుపొందగా.. 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది.

    తుది జట్లు :
    Punjab Kings (Playing XI): KL Rahul(w/c), Chris Gayle, Deepak Hooda, Nicholas Pooran, Prabhsimran Singh, Shahrukh Khan, Chris Jordan, Riley Meredith, Ravi Bishnoi, Mohammed Shami, Harpreet Brar

    Royal Challengers Bangalore (Playing XI): Virat Kohli(c), Devdutt Padikkal, Rajat Patidar, Glenn Maxwell, AB de Villiers(w), Shahbaz Ahmed, Daniel Sams, Kyle Jamieson, Harshal Patel, Mohammed Siraj, Yuzvendra Chahal
    Published by:Sridhar Reddy
    First published: