• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 PBKS VS RCB LIVE UPDATES PUNJAB KINGS SETS GOOD TOTAL ON BOARD SRD

PBKS vs RCB : రాహుల్ కా కమాల్.. పంజాబ్ కెప్టెన్ మెరుపులతో RCB కి భారీ టార్గెట్..

PBKS vs RCB : రాహుల్ కా కమాల్.. పంజాబ్ కెప్టెన్ మెరుపులతో RCB కి భారీ టార్గెట్..

PBKS vs RCB : వరుస విజయాల్ని కంటిన్యూ చేయాలని ఒక జట్టు.. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి ఫామ్ లోకి రావాలని మరొక జట్టు. కోహ్లీ వర్సెస్ రాహుల్ పోరు ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడం గ్యారెంటీ. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన పంజాబ్ మంచి టోటల్ ను సెట్ చేసింది.

  • Share this:
    అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 57 బంతుల్లో 91 పరుగులు (7 ఫోర్లు, 5 సిక్సర్లు) తో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు బౌలర్లలో జెమీసన్ రెండు వికెట్లు తీశాడు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు మంచి స్టార్ట్ లభించలేదు. ఏడు పరుగులు చేసిన ప్రభు సిమ్రాన్ కైల్ జేమీసన్ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత గేల్ షో మొదలైంది. వన్ డౌన్ లో యూనివర్శల్ బాస్ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. మరో ఎండ్ లో క్రిస్ గేల్ కు సహకరిస్తూ.. చెత్త బంతుల్ని బౌండరీలు తరలించాడు పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్. గేల్‌ జేమిసన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 6వ ఓవర్లో ఐదు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత చహల్‌ వేసిన 7వ ఓవర్లో రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న గేల్ వికెట్ ను తీసి పంజాబ్ కి షాకిచ్చాడు డేనియల్ సామ్స్. ధాటిగా ఆడుతున్న గేల్‌(46) డేనియల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాహుల్, గేల్ ల 80 పరుగుల పార్టనర్ షిష్ కు బ్రేక్ పడింది. అయితే, ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది పంజాబ్. 12వ ఓవర్లో జేమిసన్‌ బౌలింగ్‌లో పూరన్‌ మరోసారి డకౌట్‌ కాగా.. పూరన్‌కు ఈ సీజన్‌లో నాలుగో డకౌట్‌ కావడం విశేషం.

    ఇక 14వ ఓవర్లో షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో 5 పరుగులు చేసిన హుడా పాటిధార్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్‌లో చహల్‌ బౌలింగ్‌లో షారుఖ్‌ ఖాన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా.. తన క్లాసిక్ బ్యాటింగ్ తో జట్టును ఆదుకున్నాడు కెప్టెన్ రాహుల్. ఆఖర్లో రాహుల్ కు తోడుగా, హర్ ప్రీత్ బర్ కూడా బ్యాట్ ఝళిపించడంతో పంజాబ్ ఈ స్కోరు చేయగలిగింది. వీరిద్దరి ఆరో వికెట్ కు 61 పరుగుల పార్టనర్ షిప్ ను నమోదు చేశారు.

    ఐపీఎల్‌లో బెంగళూరు, పంజాబ్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలుపొందగా.. 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది.
    Published by:Sridhar Reddy
    First published: