• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 PBKS VS RCB LIVE UPDATES PUNJAB KINGS RECORDS WIN AGAINST KOHLIS TEAM SRD

PBKS vs RCB : హర్ ప్రీత్ తీన్ మార్.. పంజాబ్ భల్లే భల్లే.. RCBకి తప్పని ఓటమి..

PBKS vs RCB : హర్ ప్రీత్ తీన్ మార్.. పంజాబ్ భల్లే భల్లే.. RCBకి తప్పని ఓటమి..

PBKS vs RCB : ఆడుతుంది ఫస్ట్ మ్యాచ్. కానీ.. ఆ యంగ్ స్పిన్నర్ రెచ్చిపోయాడు. విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్, డివిలియర్స్ లాంటి టాప్ బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ పంపి.. తన జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. అతడే హర్ ప్రీత్ బార్.

  • Share this:
    నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విక్టరీ కొట్టింది. 34 పరుగుల తేడాతో కోహ్లీసేనను చిత్తు చేసింది పంజాబ్. ఆఖర్లో హర్షల్ పటేల్ 13 బంతుల్లో 31 పరుగులతో మెరుపులు మెరిపించినా.. అప్పటికే ఆలస్యం అయిపోయింది. యంగ్ స్పిన్నర్ హర్ ప్రీత్ బార్ మూడు వికెట్లతో మ్యాచ్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. రవి బిష్ణోయ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. 7 పరుగులు చేసిన ఓపెనర్ పడిక్కల్‌ మెరిడిత్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లీ, పాటిదార్ పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు. కోహ్లీ అప్పడప్పుడూ బౌండరీలు కొట్టినా.. వేగంగా ఆడలేకపోయాడు. మరో ఎండ్ లో పాటిధార్ భారీ షాట్లకు ప్రయత్నిస్తునే ఉన్నాడు కానీ.. ఒక బంతికి కూడా కనెక్ట్ అవ్వలేదు. పరుగులు రాకపోవడంతో ఒత్తిడిలో పడ్డ విరాట్ కోహ్లీ ..భారీ షాట్ కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 35 పరుగులు చేసిన కోహ్లీని యంగ్ స్పిన్నర్ హర్ ప్రీత్ బార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వెంటనే ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. హర్‌ప్రీత్‌ బార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో రెండో బంతికి క్లీన​ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత డివిలియర్స్ ను కూడా పెవిలియన్ పంపాడు హర్ ప్రీత్. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో హర్‌ప్రీత్‌బార్‌ బౌలింగ్‌లొ డివిలియర్స్‌(3) రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక, పరుగుల కోసం నానా తంటాలు పడ్డ..పాటిదార్..31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రిస్‌ జోర్డాన్‌ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 8 పరుగులు చేసిన షాబాజ్‌ అహ్మద్‌ రవి బిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ వెంటనే డేనియల్ సామ్స్ కూడా రవి బిష్ణోయ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

    ఇక ఆఖర్లో... హర్షల్ పటేల్, కైల్ జేమీసన్.. తమ బ్యాట్లకు పనిచెప్పడంతో.. ఓటమి తేడాను తగ్గించుకోగలిగింది కోహ్లీసేన.ఇక అంతకు ముందు టాస్ ఓడి.. బ్యాటింగ్ కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసి.. బెంగళూరు ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కేఎల్ రాహుల్ సూపర్ ఇన్నింగ్స్ తో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (91; 57 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులు) భారీ హాఫ్ సెంచరీ చేయగా.. యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ (46; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) విధ్వంసం సృష్టించాడు. ఇక ఇన్నింగ్స్ చివరలో హర్‌ప్రీత్‌ బార్‌ 17 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ఇక పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక వికెట్ కూడా తీయకుండా.. ఏకంగా 53 రన్స్ ఇచ్చుకున్నాడు. దీంతో హర్షల్ బౌలింగ్ చేసి ఫిఫ్టీ కొట్టాడు.

    ఇక, రేపు అసలు సిసలు సమరం జరగనుంది. ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: