• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 PBKS VS KKR LIVE UPDATES PUNJAB KINGS SETS NORMAL TARGET FOR KOLKATA KNIGHT RIDERS SRD

PBKS vs KKR : కోల్ కతా బౌలర్ల దెబ్బకి చేతులేత్తేసిన పంజాబ్...KKR టార్గెట్ ఎంతంటే..

PBKS vs KKR : కోల్ కతా బౌలర్ల దెబ్బకి చేతులేత్తేసిన పంజాబ్...KKR టార్గెట్ ఎంతంటే..

IPL 2021 PBKS vs KKR Live Updates Punjab Kings sets normal target for kolkata knight riders srd - PBKS vs KKR : గెలుపు కోసం ఆతృతగా చూస్తోన్న టీమ్ ఒకవైపు.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ లో ఖంగు తిన్పించిన టీమ్ మరోవైపు. కాసేపట్లో మరో ఆసక్తికర సమరానికి ఐపీఎల్ వేదిక కానుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ పోరులో గెలుపెవరిదో..?

  • Share this:
    నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న కోల్ కతా వర్సెస్ పంజాబ్ పోరులో కేకేఆర్ బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లతో సత్తా చాటగా, నరైన్, కమిన్స్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ బ్యాట్స్ మన్ స్కోరు చేయడానికే నానా తంటాలు పడ్డారు. 36 పరుగులు వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది పంజాబ్. సూపర్ ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ ను పెవిలియన్ కు పంపాడు ప్యాట్ కమిన్స్. రాహుల్ 20 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఆ వెంటనే పంజాబ్ కు మరో షాక్ తగిలింది. క్రిస్ గేల్ యంగ్ బౌలర్ శివమ్ మావీ బౌలింగ్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది పంజాబ్. ఆ వెంటనే దీపక్ హుడా కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఒక పరుగు చేసిన హుడా.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత పూరన్, మయంక్ నెమ్మదిగా స్కోరు బోర్డును కదిలించే ప్రయత్నం చేశారు. అయితే.. 34 బంతుల్లో 31 పరుగులు చేసిన మయాంక్ ను సునీల్ నరైన్ బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే హెన్రిక్స్ కూడా రెండు పరుగులు మాత్రమే చేసి సునీల్ నరైన్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు.

    ఆ తర్వాత పూరన్ కూడా వరుణ చక్రవర్తి బౌలింగ్ లో ఔటయ్యాడు. పూరన్ 19 బంతుల్లో 19 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖర్లో షారుఖ్ ఖాన్ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు. అయితే, క్రిస్ జోర్డాన్ మాత్రం తన బ్యాట్ కు పని చెప్పాడు. ఆఖర్లో ఈ ఇంగ్లండ్ ప్లేయర్ మెరుపులు మెరిపించడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది పంజాబ్. జోర్డాన్ 18 బంతుల్లో 30 పరుగులు చేశాడు.

    ఇప్పటి వరకూ 27 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో 18 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది. మిగిలిన 9 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలుపొందింది.
    Published by:Sridhar Reddy
    First published: