Home /News /sports /

PBKS vs KKR : నరేంద్ర మోదీ స్టేడియంలో గెలుపెవరిది.? టాస్ గెలిచిన KKR ..

PBKS vs KKR : నరేంద్ర మోదీ స్టేడియంలో గెలుపెవరిది.? టాస్ గెలిచిన KKR ..

PBKS vs KKR : గెలుపు కోసం ఆతృతగా చూస్తోన్న టీమ్ ఒకవైపు.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ లో ఖంగు తిన్పించిన టీమ్ మరోవైపు. కాసేపట్లో మరో ఆసక్తికర సమరానికి ఐపీఎల్ వేదిక కానుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ పోరులో గెలుపెవరిదో..?

ఇంకా చదవండి ...
  ఐపీఎల్ 2021 సీజన్ లో మరి కాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ పోరుకు తెర లేవనుంది. వరుస పరాజయాలతో ఢీలా పడిపోయిన కోల్ కతా నైట్ రైడర్స్.. ముంబై ఇండియన్స్ పై గెలిచి ఊపు మీదున్న పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడిన కోల్‌కతా నాల్గింటిలో ఓడిపోగా.. పంజాబ్ మూడు మ్యాచ్‌ల్లో ఓడి రెండింటిలో విజయం సాధించింది. కోల్‌కతా జట్టులో ఓపెనర్లు నితీశ్ రాణా, శుభమన్ గిల్ పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నారు. ఇద్దరూ ఆరంభం ఇస్తేనే భారీ స్కోర్ చేయొచ్చు. నెం.3లో ఆడుతున్న రాహుల్ త్రిపాఠి మాత్రం దూకుడుగా ఆడుతున్నా.. మెరుగైన స్కోర్లు నమోదు చేయలేకపోతున్నాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్ తక్కువ స్కోర్లకే వికెట్ చేజార్చుకుంటున్నారు. దినేష్ కార్తీక్, ఆండ్రీ రసెల్, పాట్ కమిన్స్ మెరుపులు ఒక మ్యాచ్‌కే పరిమితం అయ్యాయి. అందరూ సమిష్టిగా ఆడితేనే కోల్‌కతా భారీ స్కోర్ చేయగలదు లేదా ఛేదించగలదు. ఇప్పటికే ఐదు మ్యాచులు పూర్తయిన నేపథ్యంలో కోల్‌కతా విజయాల బాట పట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.

  కోల్‌కతా బౌలర్లలో స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. కమిన్స్‌ సత్తాచాటితే కోల్‌కతాకు సగం బెంగ తీరినట్టే. ప్రసిద్ క్రిష్ణ, శివమ్ మావి టీమ్‌ని గెలిపించే ప్రదర్శన ఇప్పటి వరకూ కనబర్చలేదు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా.. వికెట్ల తీయలేకపోతున్నాడు. సునీల్ నరైన్ తన మార్క్ చూపించడం లేదు. ఇప్పటికైనా అందరూ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఐతే బెన్ కట్టింగ్ లేదా లాకీ ఫెర్గూసన్ అతని స్థానంలో ఆడే అవకాశాలు ఉన్నాయి.

  మరోవైపు..పంజాబ్ జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌‌లో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడుతున్నాడు. క్రిస్‌ గేల్ మ్యాచ్ గమనానికి అనుగుణంగా ఆడుతున్నాడు. అయితే హిట్టర్ నికోలస్ పూరన్ వరుస డకౌట్లతో నిరాశపరుస్తుండడం కాస్త నిరాశపరిచే అంశం. దీపక్ హుడా, హెన్రిక్స్, షారూక్ ఖాన్ బ్యాట్ జులిపించాల్సిన సమయం వచ్చింది. ఇక మహ్మద్ షమీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బందిపెడుతుండగా.. అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్లలో అదరగొడుతున్నాడు. రవి బిష్ణోయ్, దీపక్ హుడా మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. ఇక, హెడ్ టు హెడ్ రికార్డుల్లో కోల్ కతా దే పై చేయి. ఇప్పటి వరకూ 27 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో 18 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది. మిగిలిన 9 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలుపొందింది.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chris gayle, IPL 2021, KL Rahul, Kolkata Knight Riders, Punjab kings

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు