Home /News /sports /

PBKS vs KKR : కోల్ కతా చేతిలో పంజాబ్ చిత్తు..కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మోర్గాన్..

PBKS vs KKR : కోల్ కతా చేతిలో పంజాబ్ చిత్తు..కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మోర్గాన్..

PBKS vs KKR : కోల్ కతా చేతిలో పంజాబ్ చిత్తు..కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మోర్గాన్..

PBKS vs KKR : కోల్ కతా చేతిలో పంజాబ్ చిత్తు..కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మోర్గాన్..

PBKS vs KKR : వరుస పరాజయాలతో సతమతమవుతున్న కోల్ కతా ఎట్టకేలకు వాటికి పుల్ స్టాప్ పెట్టింది. మోదీ స్టేడియంతో తమ లక్కును మార్చుకుని.. విజయాల బాట పట్టింది మోర్గాన్ సేన.

    నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ విక్టరీ కొట్టింది. ఐదు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది కేకేఆర్. మరో 20 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. కెప్టెన్ మోర్గాన్ 40 బంతుల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హెన్రిక్స్, షమీ, ఆర్షదీప్ సింగ్, దీపక్ హుడా తలా ఓ వికెట్ తీశారు. 124 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా కు ఆదిలోనే షాక్ తగిలింది. 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోసారి ఓపెనర్లు నిరాశపర్చగా.. సునీల్ నరైన్ కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఈ దశలో రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మోర్గాన్ తమ బ్యాటింగ్ తో కోల్ కతా ఇన్నింగ్స్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 66 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. మరోవైపు మోర్గాన్..మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని దీపక హుడా వీడదీశాడు. 32 బంతుల్లో 41 పరుగులు చేసిన త్రిపాఠిని పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వెంటనే రస్సెల్ కూడా 9 బంతుల్లో 10 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ మోర్గాన్ తో చేరిన దినేశ్ కార్తీక్ మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. 6 బంతుల్లో 12 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు కార్తీక్.

    అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు చుక్కలు చూపారు కోల్ కతా బౌలర్లు. కోల్‌ కతా నైట్ రైడర్స్ బౌలర్లు ప్రసిధ్ కృష్ణ(3/30), సునీల్ నరైన్(2/22), ప్యాట్ కమిన్స్(2/31) బంతితో రఫ్పాడించడంతో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ప్రత్యర్థి ముందు 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచారు. మయాంక్ అగర్వాల్(34 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 31), క్రిస్ జోర్డాన్(18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 30)మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. చివర్లో జోర్డాన్ భారీ సిక్సర్లు కొట్టడంతో పంజాబ్ ఆ స్కోర్ అయినా చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో ప్రసిధ్, సునీల్, కమిన్స్‌కు తోడుగా.. వరుణ్ చక్రవర్తీ, శివం మావి తలో వికెట్ తీశారు.

    ఇక, రేపు మరో ఇంట్రెస్టింగ్ పోరు జరగనుంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు. ప్రస్తుతం రెండు జట్లు మంచి ఫామ్ లో ఉన్నాయ్. దీంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2021, Kolkata Knight Riders, Punjab kings

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు