ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌ను భారత్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రూపోందిస్తోంది. ఇటీవలే ప్రాథమికంగా పరిమితమైన వేదికలను నిర్ణయించింది. బెంగళూర్,ఢిల్లీ,చెన్నై,కోల్‌కతా,అహ్మదాబాద్‌తో పాటు నిర్ణయాత్మక వేదికగా ముంబైని కూడా ఎంచుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ముంబైలో ఐపీఎల్ నిర్వహిస్తారు. కాని పక్షంలో హైదరాబాద్‌కు అవకాశం దక్కొచ్చు. గత వేదికల్లో హైదరాబాద్, జైపూర్, మొహాలిలను కూడా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా పూర్తిగా అదుపులోకి రాని నేపథ్యంలో తక్కువ వేదికలకే ఐపీఎల్‌కు పరిమితం చేయాలని చూస్తున్నారు.
అయితే వేదికల విషయంలో బీసీసీఐ పునారలోచనలో పడినట్లు తెలుస్తోంది. గత వారం సమావేశమైన బీసీసీఐ కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధూమల్, తాత్కాలిక సీఈవో హేమంగ్ అమిన్, ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఐపీఎల్ వేదికలపై చర్చించారు. ప్రాథమికంగా చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా ఎంపిక చేశారు. ముంబై మ్యాచ్‌లు నిర్వహణకు పరిస్థితి అనుకూలంగా లేదని భావించిన సభ్యులు ప్రేక్షకులు లేకుండా ప్రభుత్వం నిర్ణయం మేరకు మ్యాచ్‌ల నిర్వహించాలని తెలిపారు.
కాని ఐపీఎల్ టాఫ్ టీం సన్‌రైజర్స్ సొంత మైదానం హైదరాబాద్‌ను మాత్రం విస్మరించారు. దీంతో బీసీసీఐపై పలువురు మండిపడుతున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్,అజారుద్దున్ సైతం ఉప్పల్‌లో మ్యాచ్‌లను జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు లేకపోవడం, కరోనా కేసులు తక్కువ ఉన్నాయని కావున భాగ్యనగారాన్ని ఐపీఎల్ వేదికలో ఒక్కటిగా చేర్చాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా బీసీసీఐని కొరింది. అయితే ప్రాథమికంగా ఎంపిక చేసిన ముంబైలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో ఆ స్థానంలో హైదరాబాద్‌ను చేర్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.