RCB vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. హార్దిక్ పాండ్యా వచ్చేశాడు..!

టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న ముంబై ఇండియన్స్ (PC: IPL)

  • Share this:
    ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - ముంబై ఇండియన్స్ మధ్య కీలకపోరు జరుగుతున్నది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. వరుసగా రెండు ఓటములతో టాప్ 4 నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉన్నది. గత రెండు మ్యాచ్‌లు మిస్ అయిన హార్దిక్ పాండ్యా తుది జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ ఆడిన సౌరభ్ తివారీని పక్కన పెట్టారు.

    ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి కూడా అలాగే ఉన్నది. గత రెండు మ్యాచ్‌లు ఓడిపోయి విమర్శలు ఎదుర్కున్నది. ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీ నాయకత్వంపై అనుమానాలు నెలకొన్నాయి. తుది జట్టులో మూడు మార్పులు చేశారు. నవదీప్ సైనీ, వానిందు హసరంగ. టిమ్ డేవిడ్ స్థానంలో షాహబాజ్, డాన్ క్రిస్టియన్, కేల్ జేమిసన్ తిరిగి వచ్చారు. తుది జట్లు ఇలా ఉన్నాయి.











    ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో చాలా ఆసక్తికరంగా మారింది.
    Published by:John Naveen Kora
    First published: