Rohit Sharma Prank : రోహిత్ శర్మ చేసిన చిలిపి పనికి వణికిపోయిన భార్య రితికా.. వైరల్ వీడియో..

Rohit-Ritika (Photo : Instagram)

Rohit Sharma Prank : రోహిత్ శర్మ.. మ్యాచ్‌లు లేనప్పుడు సరదాగా గడుపుతూ, తోటి ఆటగాళ్లు, తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. ముఖ్యంగా ఫ్యామీలీ మ్యాన్ అని చెప్పుకోవచ్చు.

  • Share this:
    టీమిండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma Latest Telugu News) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. తనదైన రోజున ఎలాంటి బౌలింగ్ లైనప్ కైనా చుక్కలు చూపిస్తాడు. ఇక, ఐపీఎల్ (IPL) లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. ఇక, రోహిత్ శర్మ టీమ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పరిస్థితి డూ ఆర్ డై లా మారింది. రేపు.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ రోహిత్ సేన భవిష్యత్తు తేల్చనుంది. ఇక, రోహిత్ శర్మ.. మ్యాచ్‌లు లేనప్పుడు సరదాగా గడుపుతూ, తోటి ఆటగాళ్లు, తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. ముఖ్యంగా ఫ్యామీలీ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. అతని ఇన్ స్టా గ్రామ్ చూస్తే ఈజీగా ఈ విషయం అర్ధమవుతోంది. ఇక, లేటెస్ట్ గా రోహిత్‌.. తన భార్య రితికా సజ్దేను ప్రాంక్‌ చేసి భయపెట్టిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను రోహిత్‌ స్వయంగా చిత్రీకరించి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేయగా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.

    ఈ వీడియోలో రోహిత్.. అద్దం ముందు నిల్చోని తన పిడికిలిలో ఓ చాక్లెట్‌ను ఉంచుకుంటాడు. అక్కడి నుంచి మరో రూంలో ఉన్న భార్య రితిక వద్దకు వెళ్తాడు. పిడికిలిలో ఏముందో చూడాలంటూ భార్యను కోరతాడు. అందులో ఏదో భయపెట్టే వస్తువు ఉంటుందని భావించిన రితిక.. పిడికిలిని ఓపెన్ చేసేందుకు భయపడింది.



    రోహిత్ ఎంత అడిగినా రితిక పిడికిలిని ఓపెన్ చేయకపోవడంతో.. హిట్‌మ్యాన్‌ సస్పెన్స్‌ను తెరదించుతాడు. అందులో చాక్లెట్‌ను చూసిన రితిక.. తెగ నవ్వుకుంటుంది. ఈ సరదా వీడియోను రోహిత్.. అభిమానులతో పంచుకున్నాడు. రోహిత్ చేసిన ఈ చిలిపి పనికి అతని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

    ఇది కూడా చదవండి :  కింగ్స్ వర్సెస్ కింగ్స్ పోరులో గెలుపెవరిదో..? తుది జట్లు ఇవే..!

    మరోవైపు, ముంబై టీం 13 మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఆరింట్లో గెలిచి.. 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఇక, చివరి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. నాలుగో స్థానం కోసం కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరి లీగ్ పోటీల వరకు.. నాలుగో స్థానం ఎవరి దక్కించుకుంటారన్నది సస్పెన్సే. ఇక, వచ్చే టీ-20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మనే కీలకం. అతను అందించే శుభారంభాలే టీమిండియా విజయావశకాల్ని డిసైడ్ చేసే అవకాశం ఉంది.
    Published by:Sridhar Reddy
    First published: