IPL 2021 : ఆ ముగ్గురి కోసం స్పెషల్ ఫ్లైట్.. ఇంగ్లండ్ నుంచి నేరుగా అబుదాబి.. నెట్టింట పేలుతున్న సెటైర్లు..

ప్రతీకాత్మక చిత్రం

IPL 2021 : టీమిండియా (Team India) ఆడాల్సిన 5వ టెస్టు కోవిడ్ కారణంగా రద్దు చేయడంతో ఆటగాళ్లు అందరూ ఇంగ్లాండ్ వదిలి వచ్చేస్తున్నారు.

 • Share this:
  టీమిండియా (Team India) ఆడాల్సిన 5వ టెస్టు కోవిడ్ కారణంగా రద్దు చేయడంతో ఆటగాళ్లు అందరూ ఇంగ్లాండ్ వదిలి వచ్చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఐపీఎల్‌ 2021 రెండవ ఫేజ్ ప్రారంభం కానుండటంతో ఇంగ్లండ్‌ టూర్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ (Mumbai Indians Latest Telugu News) ఆటగాళ్లు..రోహిత్ శర్మ (Rohit Sharma News), సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను స్పెషల్ ఫ్లైట్ లో యూఏఈకి చేర్చింది ఫ్రాంచైజీ. రోహిత్ శర్మతో పాటు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ సతీ సమేతంగా అబుదాబిలో అడుగుపెట్టారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుతో ఉన్న ఈ ముగ్గురు ఆటగాళ్లు.. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌ల కోసం ముంబై ఇండియన్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో యూఏఈకి చేరుకున్నారు. అయితే ఇంగ్లండ్ నుంచి వచ్చే ముందు ఈ ముగ్గురికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగటీవ్ వచ్చిందని, దీంతోనే ప్రత్యేక విమానంలో అబుదాబికి తీసుకొచ్చామని ముంబై ఇండియన్స్ ప్రకటించింది.

  అబుదాబికి చేరుకున్న రోహిత్, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌ల ఫొటోలను కూడా ట్వీట్ చేసింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ అబుదాబి వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేయగా.. బీసీసీఐ ఆదేశాల మేరకు ఈ ముగ్గురు ఆటగాళ్లు వారం రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆ తర్వాత జట్టుతో కలవనున్నారు.


  షెడ్యూల్ ప్రకారం 5వ టెస్టు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 14 లేదా 15న యూఏఈకి బయలుదేరాల్సి ఉంది. కానీ భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఆఖరి టెస్ట్ రద్దయింది. దాంతో భారత ఆటగాళ్లు ముందుగానే యూఏఈకి పయనమయ్యారు. టెస్ట్ సిరీస్ సజావుగా జరుగుంటే.. ఆటగాళ్లు ఎలాంటి క్వారంటైన్ అవసరం లేకుండానే బబుల్ టు బబుల్ నేరుగా జట్టుతో కలిసేవారు. కానీ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా వైరస్ బారనపడటం.. అతనికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్ కూడా పాజిటీవ్ తేలడం.. ఐదో టెస్ట్‌కు ముందు అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కూడా ప్రాణంతక వైరస్ సోకడంతో చివరి మ్యాచ్ రద్దయింది.


  ఇక, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తమ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మహమ్మద్‌ సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌ను లండన్‌కు పంపించనుంది. ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి చేరుకోనున్న ఈ ఇద్దరు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లీ, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌ను సిద్ధం చేశాం. శనివారం రాత్రి కోహ్లీ, సిరాజ్‌లు చార్టర్‌ ఫ్లైట్‌ ఎక్కుతారు.. ఆదివారం ఉదయం దుబాయ్‌లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.

  ఇది కూడా చదవండి : చిక్కుల్లో ధోనీ.. మిస్టర్ కూల్ కి 15 రోజుల డెడ్ లైన్ విధించిన సుప్రీం కోర్టు..

  మరోవైపు, నెట్టింట వేదికగా టీమిండియా ఆటగాళ్లపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కేవలం ఐపీఎల్ కోసమే కరోనాను సాకుగా చూపి.. ఐదో టెస్ట్ ను రద్దు చేశారంటూ మండిపడుతున్నారు. పాజిటివ్ వస్తే.. ఐపీఎల్ లో ఆడలేమని.. టీమిండియా ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: