హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL Auction 2022: హైద‌రాబాద్‌ కుర్రాడి కోసం పోటీ ప‌డ్డ ముంబై, చెన్నై.. చివ‌రికి ఏ జట్టుకు సొంత‌మ‌య్యాడంటే

IPL Auction 2022: హైద‌రాబాద్‌ కుర్రాడి కోసం పోటీ ప‌డ్డ ముంబై, చెన్నై.. చివ‌రికి ఏ జట్టుకు సొంత‌మ‌య్యాడంటే

5. ఐపీఎల్ 2014 మరియు 2015 విజేతలకు రూ. 15 కోట్లు చెల్లించగా, ఓడిపోయిన ఫైనలిస్టులు రూ.10 కోట్లు అందుకొన్నారు. 2016లో విజేతలకు ప్రైజ్ మనీ రూ. 20 కోట్లు, రన్నరప్‌లకు రూ. 11 కోట్లు పెరిగింది. విజేత జట్టుకు నగదు పురస్కారం IPL 2019 వరకు మారలేదు.  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

5. ఐపీఎల్ 2014 మరియు 2015 విజేతలకు రూ. 15 కోట్లు చెల్లించగా, ఓడిపోయిన ఫైనలిస్టులు రూ.10 కోట్లు అందుకొన్నారు. 2016లో విజేతలకు ప్రైజ్ మనీ రూ. 20 కోట్లు, రన్నరప్‌లకు రూ. 11 కోట్లు పెరిగింది. విజేత జట్టుకు నగదు పురస్కారం IPL 2019 వరకు మారలేదు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

IPL Auction 2022: ఐపీఎల్ మెగావేలంలో అండర్-19 కుర్రాళ్లు మెరిశారు. వారి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. కోట్లు చెల్లించేందుకు కూడా వెనకాడలేదు.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) -2022 మెగా వేలంలో హైద‌రాబాద్ (Hyderabad) కుర్రాడు తిల‌క్ వ‌ర్మ (Tilak verma) అద‌ర‌గొట్టాడు. ఇటీవ‌ల ముగిసిన అండ‌ర్‌-19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో విజేత‌గా నిలిచిన టీమిండియా జ‌ట్టులో ఉన్న తిలక్ వ‌ర్మ ను సొంతం చేసుకోవ‌డానికి వేలంలో నాలుగు ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. రూ. 20 లక్ష‌ల బేస్ ప్రైజ్‌తో తిల‌క్ వ‌ర్మ వేలంలోకి రాగా... మొద‌ట స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బిడ్ (SRH) చేసింది. అనంత‌రం రాజ‌స్తాన్ రాయ‌ల్స్ (RR) కూడా పోటీ ప‌డ‌టంతో తిల‌క్ వ‌ర్మ ధ‌ర రూ. 50 ల‌క్ష‌లు దాటింది. ఇక్క‌డ హైద‌రాబాద్ త‌ప్పుకోగా... రాజ‌స్తాన్‌కు పోటీగా చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) వేలం రేసులోకి వ‌చ్చింది. కాసేప‌టికి రాజ‌స్తాన్ త‌ప్పుకోగా... చెన్నై దాదాపుగా తిలక్ వ‌ర్మ‌ను ద‌క్కించుకునేది. అయితే ఇక్క‌డే ట్విస్ట్ ఉంది. స‌డెన్‌గా పోటీలోకి వ‌చ్చిన ముంబై ఇండియ‌న్స్ (MI) దెబ్బ‌కు తిల‌క్ వ‌ర్మ ధ‌ర సెక‌న్లలో కోటి రూపాయ‌ల‌కు చేరుకుంది. ఈ 19 ఏళ్ల కుర్రాడి కోసం ముంబై, చెన్నై తీవ్రంగా పోటీ ప‌డ‌గా... చివ‌ర‌కు రూ1.70 కోట్ల‌కు రోహిత్ టీమ్‌కు సొంతమ‌య్యాడు. 2022 ఐపీఎల్‌లో తిల‌క్ వ‌ర్మ ముంబై (Mumbai) త‌ర‌ఫున ఆడ‌నున్నాడు.

IPL Auction: త‌మ దేశానికి ప్ర‌పంచ‌క‌ప్‌లు అందించారు.. ఐనా ఐపీఎల్ వేలంలో అమ్ముడ‌వ్వ‌లేదు

19 ఏళ్ల తిల‌క్ వ‌ర్మ లిస్ట్ ఏ కెరీర్‌లో హైద‌రాబాద్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 16 మ్యాచ్‌ల్లో 784 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు సెంచ‌రీలు, మూడు అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి. 156 నాటౌట్ ఇత‌డికి అత్య‌ధికం. ఇక టి20 కెరీర్‌లో 15 మ్యాచ్‌ల్లో 381 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోరు 75. 143.77 స్ట్ర‌యిక్ రేట్‌తో ప‌రుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి. ఓపెన‌ర్‌గా వ‌చ్చి దూకుడుగా ఆడ‌గ‌ల సత్తా తిల‌క్ వ‌ర్మ సొంతం. రోహిత్ శర్మ (Rohit Sharma) సార‌థ్యంలో తిల‌క్ వ‌ర్మ మ‌రింత రాటుదేలే అవ‌కాశం ఉంది.

IPL Auction 2022: అప్పుడేమో రూ.9.20 కోట్లు.. ఇప్పుడు రూ. 90 లక్షలు.. పాపం అతడు ఎవరంటే..

ఐపీఎల్ మెగావేలంలో అండర్-19 కుర్రాళ్లు మెరిశారు. వారి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఇటీవల జరిగిన అండర్‌-19 వరల్డ్ కప్‌లో ఇండియన్ యంగ్‌స్టర్స్ అదరగొట్టారు. టైటిల్ సాధించి శభాష్ అనిపించారు.ఆ టోర్నీలో పలువురు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఐపీఎల్ వేలం జరుతుండడంతో.. వారిపై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. కోట్లు పెట్టేందుకు కూడా వెనకడుగు వేయలేదు. ఇప్పటి వరకు పలువురు అండర్-19 ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. అంగద్ రాజ్ బవా రూ. 2.00 కోట్లు, రాజ్యవర్ధన్ హంగార్కర్ రూ. 1.50 కోట్లు, యశ్ ధుల్ రూ.50 లక్షలు, ఎన్ తిలక్ వర్మ రూ.1.70 కోట్లకు అమ్ముడుపోయారు.

First published:

Tags: Indian premier league, IPL, IPL 2022, IPL Auction 2022

ఉత్తమ కథలు