మహేంద్రసింగ్ ధోనీ బ్యాట్ పడితే ధనా ధన్.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ అడుగు పెడితే రికార్డుల మోత.. ఐపీఎల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. మళ్లీ నెట్స్ ప్రక్టీస్లో తెగ బిజీగా మారిపోయాడు. ఐపీఎల్ 14వ సీజన్ కోసం బ్యాట్ పట్టి సిక్సులు పిచ్చెక్కిస్తున్నాడు.గత సీజన్లో దారుణంగా విఫలమైన మహీ.. ఈ సీజన్లో అదరగొట్టాలనే సంకల్పంతో సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందే ట్రైనింగ్ క్యాంప్ షురూ చేసిన చెన్నై.. టైటిలే లక్ష్యంగా సిద్దమవుతోంది. ప్రాక్టీస్ మొదలు పెట్టిన మొదటి రోజే మైదానంలో సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు తలైవా. ప్రాక్టీస్ సందర్భంగా ధోనీ పలు బంతులను స్టాండ్స్‌లోకి తరలించిన వీడియోను చెన్నై ఫ్రాంచైజీ ట్విట్టర్ పోస్ట్ చేసింది. ధోనీ ఆడిన షాట్లలో తన ఫేవరెట్ అయిన హెలికాప్టర్ షాట్‌ను ఎక్కువసార్లు ఆడాడు. ధోనీ ఒక్కో షాట్ కొడుతుంటే ఈసారి అతను ఎంత కసిగా ఉన్నాడో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్లో చెన్నై ఘోర పరాభావంతో లీగ్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.
ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరిదశలో విజయాలు అందుకున్న అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ భారత్‌లో జరగడం సానుకూలాంశం.
Mahi way all the way!!! ? on #Thala #WhistlePodu #Yellove ?? pic.twitter.com/gU1TRD2ZP9
— Chennai Super Kings (@ChennaiIPL) March 11, 2021
కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న ప్రారంభమై.. మే30న ముగియనుంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. గతేడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. ఈ ఏడాది చెన్నైకి టైటిల్ అందించి ఐపీఎల్‌కు అల్విదా ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, IPL 2021, Mahendra singh dhoni, MS Dhoni