• HOME
 • »
 • NEWS
 • »
 • SPORTS
 • »
 • IPL 2021 MICHAEL VAUGHAN PREDICTION MUMBAI INDIANS WILL WIN THE TOURNAMENT SA

ఏదో అద్భుతం జరిగితే తప్పా ముంబై ఓడదు.. ముంబైతో కాకపోతే టైటిల్ ఆ జట్టుదే!

ఏదో అద్భుతం జరిగితే తప్పా ముంబై ఓడదు.. ముంబైతో కాకపోతే టైటిల్ ఆ జట్టుదే!

Mumbai Indians vs SunRisers Hyderabad

ట్విటర్ పోస్ట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాన్‌ " డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్సే టైటిల్ గెలిచి సిక్సర్ కొడుతుంది. ఏదైనా పరిస్థితులు అనుకూలించకపోతే తప్ప ముంబై వట్టి చేతులతో వెళ్లదు.

 • Share this:
  టోర్నమెంట్‌కు ముందే ఐపీఎల్ 2021 విజేత ఎవరనే దానిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్ విశ్లేషణ చేశారు. అతని అంచనా ప్రకారం రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జట్టు ఆరవ సారి టైటిల్ సాధించే అవకాశం ఉందన్నారు. ఏదో అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు ఓడిపోయే పరిస్థితే లేదన్నారు. ముంబై గెలవని పక్షంలో టైటిల్‌ గెలిచే సత్తా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే ఉందన్నాడు.  తాజాగా ట్విటర్ పోస్ట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాన్‌ " డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్సే టైటిల్ గెలిచి సిక్సర్ కొడుతుంది. ఏదైనా పరిస్థితులు అనుకూలించకపోతే తప్ప ముంబై వట్టి చేతులతో వెళ్లదు. ముంబై సాధించని పక్షంలో టైటిల్‌ గెలిచే అవకాశం సన్‌రైజర్స్‌కు మాత్రమే ఉంది" అన్నారు.  ఈ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వాన్ అంచనాపై ఇతర జట్ల అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఎవరూ గెలుస్తారనేది నువ్వే డిసైడ్‌ చేస్తే ఇక ఆడటం ఎందుకన్నారు. ఏప్రిల్‌ 9న రిచ్‌ లీగ్‌ ప్రారంభంకానుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

  ప్రస్తుతం ఐపీఎల్‌కు కోవిడ్ ముంపు పొంచి ఉంది. తాజా పరిస్థితిలో ముంబైలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముంబై నివాసితులు వాంఖడే స్టేడియం సమీపంలోనే ఉండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నగరంలో కోవిడ్ -19 కేసుల ఉధృతి కారణంగా కారణంగా ఐపిఎల్ 2021వేదికల్లొ ఒక్కటైన ముంబైని మార్చాలని పలువురు కోరుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, స్టేడియం సమిప నివాసితులలో కొందరు ఏప్రిల్ 2 న రాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు.

  స్టేడియంలోని ఆటగాళ్ళను చూడడానికి చాలా అభిమానులు స్టేడియం బయట గుమిగూడతున్నారని.. దీని కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని లేఖలో పెర్కొన్నారు. ఇప్పటికే స్టేడియం బయట పలు భవనాలు సిజ్ చేశారు. దీంతో మ్యాచ్‌లనే నాన్-రెసిడెన్షియల్ ప్రాంతంలోని స్టేడియంలోకి మార్చాలని మెరైన్ డ్రైవ్ రెసిడెంట్స్ అసోసియేషన్ సభ్యులు సిఎంను కోరారు. “
  Published by:Rekulapally Saichand
  First published: