Home /News /sports /

IPL 2021 MI VS SRH LIVE UPDATES MUMBAI INDIANS WON THE TOSS AND OPTED BAT FIRST SRD

IPL 2021 - SRH Vs MI : టాస్ గెలిచిన ముంబై.. హైదరాబాద్ కెప్టెన్ గా మనీశ్ పాండే..

SRH Vs MI

SRH Vs MI

SRH Vs MI : కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ టార్గెట్ సెట్ చేస్తోందో లేదో వేచి చూడాలి.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 (IPL 2021 Season Latest Updates) లీగ్ దశ ఈరోజుతో ముగియనుంది. శుక్రవారం ఒకే సమయానికి రెండు మ్యాచులు ఆరంభం కానున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకేసారి రెండు మ్యాచ్‌లు జరగడం ఇదే మొదటిసారి. అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఒక మ్యాచ్ జరగనుండగా.. దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచులు రాత్రి 7.30కు ప్రారంభం కానున్నాయి. ఇక, ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ముంబై ఇండియన్స్. ఇక, ఈ మ్యాచ్ లో ఆశ్చర్యకరంగా మనీశ్ పాండే సన్ రైజర్స్ కు కెప్టెన్ కు వ్యవహరించనున్నాడు. ఇక, ముంబై టీమ్ లో రెండు మార్పులు జరిగాయ్. పీయూష్ చావ్లా, కృనాల్ పాండ్యా జట్టులోకి తిరిగి వచ్చారు. ఇక, సన్ రైజర్స్ లో కూడా మార్పులు జరిగాయ్. కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ గాయాలతో బాధపడుతున్నారు. వీరి స్ధానాల్లో మహ్మద్ నబీ, మనీశ్ పాండ్యా జట్టులోకి తిరిగి వచ్చారు.

    సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసులో లేదు కాబట్టి విజయంతో టోర్నీని ముగించాలని చూస్తోంది. అయితే ఈరోజు ముంబైకి విజయం చాలా కీలకంగా మారింది. కోల్‌కతా విజయం తర్వాత ఇప్పుడు ఒక అద్భుతం జరిగితే మాత్రమే రోహిత్ సేన ప్లే ఆఫ్‌కి చేరుతుంది. అందుకే భారీ విజయమే లక్ష్యంగా ముంబై బరిలోకి దిగుతోంది.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ఐపీఎల్ టోర్నీలో భాగంగా హైదరాబాద్, ముంబై జట్లు 27 సార్లు తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ 8 సార్లు గెలుపొందగా.. ముంబై 9 విజయాలు అందుకుంది. ఐపీఎల్ 2021లో హైదరాబాద్, ముంబై తలపడిన మ్యాచులో రోహిత్ సేన విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో ఒకటి హైదరాబాద్​, నాలుగు ముంబై గెలిచింది.


    తుది జట్లు :
    సన్‌రైజర్స్‌ హైదరాబాద్: జాసన్ రాయ్, అభిషేక్ శర్మ , మనీశ్ పాండ్ (కెప్టెన్), ప్రియం గార్గ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్

    ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొల్లార్డ్, జిమ్మీ నీషమ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైల్, జస్‌ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా, ట్రెంట్ బౌల్ట్.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2021, Manish pandey, Mumbai Indians, Rohit sharma, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు