హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 - MI Vs SRH : టాస్ ఓడితే ముంబై ఇంటికే..! హైదరాబాద్ తో రోహిత్ సేన ఆఖరి పోరు..

IPL 2021 - MI Vs SRH : టాస్ ఓడితే ముంబై ఇంటికే..! హైదరాబాద్ తో రోహిత్ సేన ఆఖరి పోరు..

IPL 2021 - MI Vs SRH : అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తేనే ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ రేస్ లో నిలబడుతోంది. దాదాపు, ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే.

IPL 2021 - MI Vs SRH : అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తేనే ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ రేస్ లో నిలబడుతోంది. దాదాపు, ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే.

IPL 2021 - MI Vs SRH : అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తేనే ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ రేస్ లో నిలబడుతోంది. దాదాపు, ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే.

  ఐపీఎల్ 2021(IPL 2021 Season Latest Updates) సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే చెన్నై (CSK), ఢిల్లీ (DC), బెంగళూరు (RCB) ప్లే ఆఫ్స్ చేరుకోగా.. నాలుగో స్థానం దాదాపు కోల్ కతా వశమైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తేనే ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ రేస్ లో నిలబడుతోంది. దాదాపు, ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. ఇక, ఇవాళ ఐపీఎల్ 2021 లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్‌లు ఏకకాలంలో జరగనున్నాయ్. IPL లో గ్రూప్ ఫేజ్ చివరి రోజు ఏకకాలంలో మ్యాచ్‌లు ఆడడం ఇదే మొదటిసారి. మునుపటి షెడ్యూల్ ప్రకారం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్‌తో ఒక రోజు ఆటలో మధ్యాహ్నం 3:30 కి తలపడాల్సి ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సాయంత్రం 7:30 కి జరగాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఈ రెండు మ్యాచ్‌లు సాయంత్రం 7:30 కి జరుగుతాయి.

  ఈ ఐపీఎల్‌ లీగ్ దశలో ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తన చిట్ట చివరి మ్యాచ్‌ను ఆడబోతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)ను ఢీ కొట్టబోతోంది. ఈ రెండు జట్లకూ ఈ సీజన్‌లో ఇదే చివరి మ్యాచ్ అవుతుంది. ముంబై ఇండియన్స్‌కు కూడా ఇది చివరి మ్యాచ్‌ అవుతుందనుకోవడంలో సందేహాలు అక్కర్లేదు. ఈ సాయంత్రం 7:30 గంటలకు అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో మ్యాచ్ ఉంటుంది. అదే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ కేపిటల్స్ మధ్య మరో మ్యాచ్‌ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ రెండు జట్లూ ప్లేఆఫ్స్‌లో ఎంట్రీ ఇచ్చాయి.

  ఇప్పటి వరుకు ముంబై ఇండియన్స్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య ప్లేఆఫ్స్ కోసం హోరాహోరి పోరు నడిచిన విషయం తెలిసిందే. ఈ బిగ్ ఫైట్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ గెలిచింది..ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్ గెలవడంతో తన పాయింట్లను సంఖ్యను 14కు పెంచుకోగలిగింది నైట్ రైడర్స్. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఖాతాలో ఉన్న పాయింట్లు 12. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచి.. 14 పాయింట్లను సాధించినా గానీ ప్లేఆఫ్స్‌లో వెళ్లలేదు. పాయింట్లు సమానంగా ఉన్నా.. నెట్ రన్‌రేట్ విషయంలో నైట్ రైడర్స్.. ముంబై కంటే చాలా మెరుగ్గా ఉంది.

  ముంబై ఇండియన్స్ తన నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరచుకోవడానికి అందుబాటులో ఉన్న ఏకైక మ్యాచ్‌ను ఈ సాయంత్రం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ విషయంలో టాస్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముంబై ఇండియన్స్ టాస్ గెలిస్తే- తొలుత బ్యాటింగ్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

  200లకు పైగా పరుగులు చేయాల్సి ఉంటుంది. తన ప్రత్యర్థిని 171 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. అలా లక్ష్యాన్ని నిర్దేశించాలీ అంటే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం తప్పనిసరి. ఇలా చేయగలిగితేనే నెట్ రన్‌రేట్‌‌లో నైట్ రైడర్స్‌ను అధిగమించగలుగుతుంది. టాస్ ఓడిపోయి- ఫీల్డింగ్ చేయాల్సి వస్తే.. ఆ ఛాన్స్ కూడా ఉండదు.

  ఇది కూడా చదవండి : పాకిస్థాన్ టీమ్ కు బంపరాఫర్.. టీ-20 వరల్డ్ కప్ లో భారత్ ను ఓడిస్తే ఏకంగా...

  ప్రత్యర్థిపై 200లకు పైగా పరుగులు చేయాల్సి రావడం ముంబై ఇండియన్స్ వంటి బలమైన జట్టుకు పెద్దగా అసాధ్యమైన పనేమీ కాదు. ఇదివరకు 200 మార్క్‌ను దాటిన మ్యాచ్‌లు చాలానే ఉన్నాయి. అయితే, ప్రత్యర్థిపై 171 పరుగుల తేడాతో గెలవడమే అసలు సిసలు అగ్ని పరీక్ష. ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఆ జట్టుకైనా కష్టమే.

  First published:

  Tags: IPL 2021, Kane Williamson, Mumbai Indians, Rohit sharma, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు