IPL 2021 MI VS RR LIVE UPDATES RAJASTHAN ROYALS SETS FIGHTING TOTAL ON BOARD SRD
IPL 2021 : మెరిసిన బట్లర్, శామ్సన్...ముంబై ముందు ఫైటింగ్ టోటల్..
IPL 2021 : మెరిసిన బట్లర్, శామ్సన్...ముంబై ముందు ఫైటింగ్ టోటల్..
MI vs RR : వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో గెలవాలన్న కసితో బరిలోకి దిగింది. మరోవైపు, రాజస్థాన్ గత మ్యాచ్ లో గెలిచిన ఆనందంలో ఉంది. ఈ మ్యాచ్ లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ లో మంచి ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది రాయల్స్.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా సూపర్ ఎకానమీ స్పెల్ తో ఆకట్టుకున్నాడు. బుమ్రా తన నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. జోస్ బట్లర్, జైస్వాల్ ఇద్దరూ పవర్ ప్లేలో సూపర్ గా ఆడారు. వికెట్లు పడకుండా ఆచి తూచి ఆడుతూనే బౌండరీలు సాధించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 66 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రాహుల్ చాహర్ విడదీశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన బట్లర్(41) రాహుల్ చహర్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. బట్లర్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత కాసేపటికే జైస్వాల్ కూడా రాహుల్ చాహర్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. రాహుల్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ మూడో బంతిని భారీ సిక్స్ బాదిన జైస్వాల్(32) ఐదో బంతికి కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో 91 పరుగులకు తమ రెండో వికెట్ ను కోల్పోయింది రాయల్స్. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శామ్సన్, శివమ్ దూబే నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. వీరిద్దరూ అడపా, దడపా బౌండరీలతో చెలరేగారు. దీంతో వీరిద్దరి మూడో వికెట్ కు 57 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే, ఆఖర్లో భారీ షాట్ కు ప్రయత్నించిన సంజూ శామ్సన్ ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సంజూ శామ్సన్ 27 బంతుల్లో 42 పరుగులు చేశాడు.
ఇక, ఆఖర్లో శివమ్ దూబే భారీ షాట్లకు ప్రయత్నించాడు. ఒకటి, రెండు బంతులు కనెక్ట్ అయ్యాయ్. కానీ, బుమ్రా బౌలింగ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. భారీ షాట్ కు ప్రయత్నించి శివమ్ దూబే బుమ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు. 31 బంతుల్లో 35 పరుగులతో రాణించాడు శివమ్ దూబే. బుమ్రా ఎకానమీ స్పెల్ తో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేయలేకపోయింది.
ఐపీఎల్లో ముంబై, రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.