IPL 2021 MI VS RR LIVE UPDATES MUMBAI INDIANS WON THE TOSS AND OPT TO BOWL FIRST SRD
MI vs RR : టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. కీలక మార్పుతో బరిలోకి రోహిత్ సేన..
MI vs RR : టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. కీలక మార్పుతో బరిలోకి రోహిత్ సేన..
MI vs RR : డిఫెండింగ్ ఛాంపియన్స్ కు ఈ సీజన్ లో కష్టాలు మాత్రం తప్పడం లేదు. భీకరంగా ఉన్న బ్యాటింగ్ లైనప్.. పరుగులు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. దీంతో ఈ మ్యాచ్ లో గెలవాలన్న కసితో బరిలోకి దిగుతోంది ముంబై. మరోవైపు, రాజస్థాన్ గత మ్యాచ్ లో గెలిచిన ఆనందంలో ఉంది. ఈ మ్యాచ్ లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది.
ఐపీఎల్ సీజన్ లో మరికాసేపట్లో మరో బిగ్ ఫైట్ జరగనుంది. ఢిల్లీ వేదికగా ఢిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది రాజస్థాన్ రాయల్స్.ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లాడిన ముంబై రెండింటిలో గెలుపొందగా.. అన్నే మ్యాచులు ఆడిన రాజస్థాన్ కూడా 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే చివరి రెండు మ్యాచుల్లో ఓడి రోహిత్ సేన ఒత్తిడిలో ఉంటే.. చివరి మ్యాచులో గెలిచిన శాంసన్ టీం మంచి జోష్ మీదుంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై టీమ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్నా.. అతని స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేదు. ఇక మరో ఓపెనర్ డికాక్ కూడా విఫలమవుతున్నాడు. దీంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పడుతోంది. సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడుతున్నా.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడట్లేదు. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూసుకుడుగా ఆడాలని చూస్తున్నారు. అయితే బౌండరీలు బాదలేక, కీలక సమయాల్లో చేతులేత్తేస్తున్నారు. కీరన్ పొలార్డ్ ఒక్కడే కాస్త నిలకడగా ఆడుతున్నాడు. అయితే అతనికి డెత్ ఓవర్లలో ఎవరూ సపోర్ట్ ఇవ్వలేకపోతుండటంతో ముంబై ఇప్పటి వరకూ భారీ స్కోరు చేయలేకపోయింది. కృనాల్ పాండ్యా కూడా తన బ్యాట్ కు పని చెప్పాల్సి ఉంది. బౌలింగ్‌లో మాత్రం ముంబై పర్వాలేదనిపిస్తోంది. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వికెట్లు పడగొట్టకపోయినా.. కాస్త పరుగులు కట్టడిచేస్తున్నారు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ ఈ జోడీ మెరిస్తేనే ముంబైకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ రాహుల్ చహర్ వికెట్లు పడగొడుతుండడం కలిసొచ్చే అంశం. అయితే అతనికి జోడీగా బౌలింగ్ చేస్తున్న కృనాల్ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు.
మరోవైపు, రాజస్థాన్ జట్టులో ఓపెనర్ జోస్ బట్లర్ ఫామ్ కలవరపెడుతోంది. కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుంటూ జట్టుని ఒత్తిడిలోకి నెడుతున్నాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తున్న బట్లర్.. త్వరగా వికెట్ చేజార్చుకుంటున్నాడు. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ గత మ్యాచ్‌లో వరుస బౌండరీలతో హోరెత్తించాడు. అదే ప్రదర్శనను రాజస్థాన్ ఈరోజు కోరుకుంటోంది. కెప్టెన్ సంజు శాంసన్ ఫామ్ ఊరటనిచ్చే అంశం. శివమ్ దూబె, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్ పరుగులు చేయడం రాజస్థాన్‌కి కలిసొచ్చే అంశం. క్రిస్ మోరీస్ ఫామ్ లోకి రావడం రాజస్థాన్ రాయల్స్ కు కలిసొచ్చే అంశం. చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రహ్మాన్, జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్ లో రాణిస్తున్నారు.
ఐపీఎల్లో ముంబై, రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
తుది జట్లు :
Rajasthan Royals (Playing XI): Jos Buttler, Yashasvi Jaiswal, Sanju Samson(w/c), Shivam Dube, David Miller, Rahul Tewatia, Riyan Parag, Chris Morris, Jaydev Unadkat, Chetan Sakariya, Mustafizur Rahman
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.