• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 MI VS RR LIVE UPDATES MUMBAI INDIANS WON BY 7 WICKETS SRD

MI vs RR : డికాక్ సూపర్ క్లాస్...రాజస్థాన్ రాయల్స్ ఖల్లాస్..ముంబైదే విక్టరీ..

MI vs RR : డికాక్ సూపర్ క్లాస్...రాజస్థాన్ రాయల్స్ ఖల్లాస్..ముంబైదే విక్టరీ..

MI vs RR : డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎట్టకేలకు సూపర్ విక్టరీ కొట్టింది. వరుస ఓటములతో సతమతమవుతున్న రోహిత్ సేన.. రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. క్వింటన్ డికాక్ సూపర్ ఇన్నింగ్స్ తో అజేయంగా నిలిచి.. ముంబైకి విక్టరీ అందించాడు.

  • Share this:
    ఢిల్లీ వేదికగా జరుగుతున్న పోరులో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ కొట్టింది. ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. క్వింటన్ డికాక్ సూపర్ క్లాస్ ఇన్నింగ్స్ తో ముంబైకి విక్టరీ అందించాడు. 50 బంతుల్లో 70 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు) తో అజేయంగా నిలిచాడు డికాక్. అతనికి తోడుగా కృనాల్ పాండ్యా మెరిశాడు. కృనాల్ 26 బంతుల్లో 39 పరుగులు ( 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో డికాక్ కు సహకారం అందించాడు. రాజస్ధాన్ రాయల్స్ బౌలర్లలో మోరిస్ రెండు వికెట్లు తీయగా.. రెహ్మాన్ ఒక వికెట్ తీశాడు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ ఫస్ట్ నుంచే దూకుడు ప్రదర్శించింది. ముఖ్యంగా డికాక్ చెత్త బంతిని బౌండరీ తరలిస్తూ స్కోరు వేగం పెంచాడు. రోహిత్ శర్మ పరుగులు చేయడానికి కాస్తా ఇబ్బంది పడినా.. డికాక్ మాత్రం పవర్ ప్లే లో చెలరేగాడు. ఇక, ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌లో మోరిస్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్‌ సకారియాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ 17 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సూర్య కుమార్ యాదవ్ వరుస బౌండరీలతో ఆకట్టుకున్నాడు. అయితే 10 బంతుల్లో 16 పరుగులు చేసిన సూర్యను క్రిస్ మోరిస్ బోల్తా కొట్టించాడు. జోస్ బట్లర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు సూర్య కుమార్ యాదవ్. ఆ తర్వాత.. డికాక్ తో కలిసిన కృనాల్ మంచి స్ట్రైక్ రేట్ తో పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 63 పరుగులు జోడించారు.

    అయితే, 39 పరుగులు చేసిన కృనాల్‌ పాండ్యా ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఇక, ఆఖర్లో బ్యాటింగ్ కు దిగిన పొలార్డ్ మిగతా పని కానిచ్చాడు. 8 బంతుల్లో 16 పరుగులు చేసి ముంబైకి సూపర్ విక్టరీ అందించాడు. ఈ విజయంతో ముంబై ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయ్. ముంబై టాప్ -4 లో నిలిచింది.

    అంతకుముందు టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్ రాయల్స్‌ పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసి.. ముంబై ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (41; 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు), యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (32; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ సంజు శాంసన్ (42; 27 బంతుల్లో 5 ఫోర్లు), హిట్టర్ శివమ్ దూబే (35; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో రాహుల్ చహర్ రెండు వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీశారు. ముఖ్యంగా బుమ్రా సూపర్ ఎకానమీ స్పెల్ తో అదరగొట్టాడు.
    Published by:Sridhar Reddy
    First published: