MI vs KKR, IPL 2021: త్రిపాఠి, వెంకటేశ్ మెరుపులు.. ముంబైపై కోల్‌కతా ఘన విజయం

వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి (Image:IPL)

MI vs KKR, IPL 2021: ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకొని పైకి ఎకబాగింది కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్. నిన్నటి వరకు ఆరో స్థానంలో ఉండగా.. ఇప్పుడు నాలుగో స్థానానికి చేరింది. ముంబై ఇండియన్స్ ఆరో స్థానానికి పడిపోయింది.

 • Share this:
  Mumbai vs Kolkata, 34th Match, IPL 2021: అబుదాబిలో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkat Knight riders) అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)ను చిత్తుగా ఓడించింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ (KKR) బ్యాట్స్‌మెన్ ఆడుతూ పాడుతూ చేధించారు.  కేవలం 15.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించి సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి (Rahul Tripati), వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. రాహుల్ త్రిపాఠి 42 బంతుల్లో 74 ( 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ 30 బంతుల్లో 53 ( 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేసి సత్తా చాటారు. కేకేఆర్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడడంతో కావాలసిన రన్‌రేట్ తగ్గుతూ వచ్చింది. శుభమాన్ గిల్ (13), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (7) తక్కువ పరుగులకే ఔటయినా.. త్రిపాఠి, నితీష్ రాణా చాలా ఈజీగా జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇక ముంబై బౌలర్లలో బుమ్రా ఒక్కడికే మూడు వికెట్లు దక్కాయి.  IPL 2021: అక్కడి దరిద్రం మాకు చుట్టుకుంది.. కేదార్ జాదవ్‌ను ఘోరంగా  ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

  అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ధాటిగా ఆడాడు. బౌండరీలు బాదుతూ తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. మరో ఎండ్‌లో ఉన్న క్వింటన్ డికాక్ (Quinton De cock) తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. బౌండరీలు, సిక్సులతో చెలరేగిపోయాడు. వీరిద్దరూ కలసి పవర్ ప్లేలో 56 పరుగులు జోడించారు. తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. కానీ ఆ దూకుడును చివరి వరకు కొనసాగించడంలో విఫలమయ్యారు. రోహిత్ శర్మ (33) సునిల్ నరైన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే సూర్యకుమార్ యాదవ్ (5) కూడా పెవీలియన్ చేరాడు.

  ఇదేం హెయిర్‌ స్టయిల్‌రా నాయనా.. షిమ్రోన్ హెట్‌మెయర్ జుట్టు రంగుపై  జోకులే జోకులు

  మరో ఎండ్‌లో క్వింటన్ డికాక్ తన దూకుడును కొనసాగించాడు. అయితే అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్ (55) ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో సునిల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరి కొద్ది సేపటికే ఇషాన్ కిషన్ (14) పెవీలియన్ చేరాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు మిడిల్, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో వరుసగా వికెట్లు పడటమే కాకుండా భారీగా పరుగులు రాలేదు. కిరాన్ పొలార్డ్ (21), కృనాల్ పాండ్యా (12) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. దీంతో కనీసం 180 పరుగులు చేస్తుందని భావించిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. లాకీ ఫెర్గూసన్, ప్రసిధ్ కృష్ణ తలా రెండు వికెట్లు తీయగా.. సునిల్ నరైన్‌కు ఒక వికెట్ లభించింది.

  క్రికెట్ నుంచి 'బ్యాట్స్‌మాన్' అనే పదం తొలగింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న ఎంసీసీ

  ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకొని పైకి ఎకబాగింది కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్. నిన్నటి వరకు ఆరో స్థానంలో ఉండగా.. ఇప్పుడు నాలుగో స్థానానికి చేరింది. ముంబై ఇండియన్స్ ఆరో స్థానానికి పడిపోయింది. ఇక మొదటి రెండు స్థానాల్లో వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఉండగా.. బెంగళూరు మూడు, కోల్‌కతా నాలుగో స్థానంలో ఉన్నాయి. శుక్రవారం రాత్రి షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: